ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకలాగే ఉంటే.., ఎన్నికల్లో గెలిచాక మరొక లాగా ఉంటారని చాలామంది చంద్రబాబు గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఎన్నికలలో హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలేసి సొంత లాభం కోసం ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ పరిపాలన సాగిస్తారని చాలామంది చంద్రబాబు పరిపాలన పై విమర్శలు చేస్తుంటారు. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మూడు రాజధానులలో ఒక రాజధానిగా విశాఖలో దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యంగా సొంత లాభం కోసం ఆల్రెడీ అభివృద్ధి అయిన విశాఖపట్టణానికి కాదనుకొని అప్పట్లో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి రాజధాని కోసం డబ్బులు దండుకోవడం కోసం మరియు అదే విధంగా రాజధాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కువగా తన సామాజిక వర్గానికి చెందిన వారు బాగుపడాలన ఉద్దేశంతో చంద్రబాబు వైజాగ్ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకుండా నీచమైన రాజకీయం కోసం సొంత లాభం కోసం అమరావతి అనే రాజధాని డ్రామా ఆడారని తాజాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఏది ఏమైనా ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలని ఉత్తరాంధ్ర ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినా గాని వాటిని పట్టించుకోకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనగా వైజాగ్ నగరంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం హర్షణీయమని ఇదే కనుక నిజంగా వాస్తవంగా జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైనట్లే అని రాజకీయంగా చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకోవటం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొట్టమొదటిసారి రాజధాని ప్రాంతంగా వైజాగ్ గుర్తించిన తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్లడంతో ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: