విశాఖ పట్నానికి క్రమంగా రాజధాని కళ వస్తోంది. అయితే ఇప్పడు విశాఖకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. జగన్ అసెంబ్లీలో విశాఖకు రాజధాని తరలించొచ్చు అని అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత.. ఆ తర్వాత.. చంద్రబాబు పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అమరావతి రైతులు ఆందోళనలు ప్రారంభించినా చంద్రబాబు అనంతపురం జిల్లాలోనే పర్యటిస్తూ కాలం గడిపారు.

 

ఆ తర్వాత క్రమంగా అమరావతి రైతులకు మద్దతు గా మాట్లాడారు. విశాఖకు తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ స్వరం బాగా పెంచారు. దీన్ని రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అభివృద్ది చెందకుండా విశాఖపట్నానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం అన్ని మార్గాలలో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

 

చివరికి న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు. ఉత్తారంద్రకు తీరని ద్రోహం చేయడం కోసం, విశాఖను పరిపాలన కేంద్రం చేయాలన్న ఉద్దేశాన్ని నీరుగార్చాలని కుట్ర పన్నుతున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు. పరిపాలనకు అనుకూలంగా ఉంటుందనే విశాఖ రాజధాని ఆలోచన జరుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు తన ఆస్తుల కోసమే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని విజయ సాయి రెడ్డి అన్నారు.

 

ఇక.. అమరావతి నుంచి రాజధానిని విశాఖ కు తరలించాలని ఏపీ సీఎం జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇక ఈ నిర్ణయంలో మార్పు లేదని అంటున్నారు. జగన్ సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే కేబినెట్ సమావేశంలో మాత్రం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా కొన్నిరోజులు మాత్రమేనని విశాఖ రాజధాని కావడం ఖాయమని మంత్రులే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: