తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమించాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలోపెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకత్వం ఇస్తానని వైసీపీ అధినేత జగన్ గతంలోనే ఆయనకు హామీ ఇచ్చాడు.

 

చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలో రమణ దీక్షితులను బలవంతంగా తిరుమల తిరుపతి ఆలయం నుంచి పంపించారు. ప్రధాన అర్చకులకు కూడా వయోపరిమితి విధిస్తూ జీవో తీసుకొచ్చి రమణ దీక్షితులను పదవీవిరమణ చేయించారు. ఈ పరిణామం తర్వాత రమణ దీక్షితులు న్యాయ పోరాటం కూడా చేశారు. ఆ సమయంలోనే ఆయన జగన్ ను కూడా కలిశారు.

 

అప్పుడే జగన్ ఆయనకు హమీ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో మొదటి నుంచి తోకపత్రికగా పేరున్న ఓ పత్రిక, దాని ఛానల్ రమణ దీక్షితులపై దుష్ప్రచారం ప్రారంభించాయి. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో రమణ దీక్షితులపై సమయం దొరికినప్పుడల్లా బురద జల్లాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకలానే ఉండవుగా. జగన్ అధికారంలోకి రావడంతో రమణ దీక్షితులు కాలం ఇప్పుడు వచ్చింది. అందుకే ఆయన మళ్లీ తిరుమల తిరుపతి ఆలయంలో ప్రధాన అర్చకుడు కాబోతున్నాడు.

 

అయితే ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేదని సదరు పత్రిక, ఛానల్ మరోసారి రమణ దీక్షితులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిని చేయడంపై దుష్ప్రచారం ప్రారంభించాయి. రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడం పట్ల అర్చకులంతా ఆగ్రహంగా ఉన్నారని బ్రేకింగ్ మీద బ్రేకింగ్ న్యూసులు వేస్తున్నాయి. అయితే అలా అంటున్న ఓ అర్చకుడితో కూడా మైక్ ముందు మాత్రం చెప్పంచరు. దీన్ని అంటారు పచ్చ జర్నలిజం అని అంటూ విసుక్కుంటున్నారు వైసీపీ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: