ఆంధ్రప్రదేశ్ రాజధాని సంబంధించి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా మాట్లాడేది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి ప్రాంతానికి సంబంధించి మొన్నటివరకు మీడియా సమావేశాలలో ఊదరగొట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ కి వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి దిమ్మతిరిగిపోయే విధంగా ట్విస్ట్ ఇవ్వబోతున్న ట్లు ఈ విషయం జగన్ కి తెలిస్తే సూపర్ అన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ ఏమిటంటే రాజధాని మ్యాటర్ విషయంలో ముఖ్యంగా విశాఖలో రాజధాని ఎక్కడో తానే చెబుతానంటూ బొత్స సత్యనారాయణ తన పెద్దరికాన్ని చాటుకోవడానికి పడిన తాపత్రయంపై వైసీపీలోనే చెవులు కొరుక్కుంటున్నారు.

 

విశాఖలో రాజధాని విషయమై తమ ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, ఆ కమిటీ అనువైన స్థలం చూసి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటామని బొత్స అంటున్నారు. మరోపక్క విజయసాయిరెడ్డి జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత విశాఖ టూర్ చేసి భీమిలి రాజధాని ప్రాంతం అని చెప్పడం జరిగింది.

 

దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బొత్సకి షాక్ ఇచ్చినట్లు అయిందని..ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో కీలకంగా అవ్వాలని చూస్తున్న తరుణంలో విజయ సాయి రెడ్డి భీమిలి లేని అడ్డాగా చేసుకొని చేసిన కామెంట్లు మొత్తానికి బొత్సకి తారుమారు కావడం జరిగాయని ఇక నుండి వైజాగ్ ప్రాంతంలో రాజధాని విషయాలన్నీ విజయసాయిరెడ్డి మాత్రమే పర్యవేక్షించాలా భవిష్యత్ అడుగులు వేయబోతున్న ట్లు అంతేకాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలకంగా మారాలని వైసీపీ పార్టీ నేతలు కొంతమంది వేస్తున్న అడుగులకు విజయసాయిరెడ్డి చెక్కు పెట్టబోతున్నట్లు  రాజధాని క్రెడిట్ ఎవరికి రాకుండా కేవలం వైసిపి పార్టీ కి లేకపోతే జగన్ కి మాత్రమే వచ్చేటట్లు విజయ సాయి రెడ్డి వైజాగ్ రాజధాని విషయంలో కీలకంగా మారబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: