అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ముందుగా చెప్పేమాట ఒక్కటే అవినీతిని అంతమొందిస్తాం.  అవినీతి లేని పాలనను అందిస్తాం.  అవినీతి ఎక్కడ ఉన్నా కూడా దానిని అంతం చేసి అర్ధవంతమైన, పారదర్శకమైన పాలనను అందిస్తామని చెప్తుంటారు.  చెప్పినట్టుగా పాలన జరుగుతుందా అంటే తప్పకుండా జరగదు.  అందులో సందేహం అవసరం లేదు.  పాలన జరుగుతుంది అనుకుంటే పొరపాటే.  అవినీతి లేకుండా పాలనా జరగడం చాలా కష్టం.  అందులోను ఇప్పటి రోజుల్లో.  


ఇక ప్రతి ఏడాది ఏసీబీ సంస్థ ఆ ఏడాదికి సంబంధించిన అవినీతి లిస్ట్ ను ఏడాది చివర్లో ప్రకటిస్తుంది.  2019 వ సంవత్సరానికి తెలంగాణలో టాప్ అవినీతి శాఖలకు సంబంధించిన లిస్ట్ ను ఏసీబీ బయటపెట్టింది.  ఇందులో టాప్ పొజిషన్లో రెవిన్యూ శాఖ ఉన్నది.  దీని తరువాత రెండో స్థానంలో హోంశాఖ, మూడో స్థానంలో మున్సిపల్ శాఖ ఉన్నది.  


ఈ లిస్ట్ ను ఏసీబీ రిలీజ్ చేయడంతో అందరు షాక్ అవుతున్నారు.  ఈ ఏడాది ఏసీబీ మొత్తం 173 కేసులను నమోదు చేసింది.  ఈ 173 అవినీతి కేసుల్లో రెవిన్యూ శాఖలో 54 కేసులు, హోమ్ శాఖలో 18 కేసులు, మున్సిపల్ శాఖలో 25 కేసులు నమోదయ్యాయి.  అంతకు ముందు ఏడాది అంటే 2018 వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా అవినీతి కేసులు అధికంగా నమోదయ్యాయి.  2019 తో పోలిస్తే 2018లో నమోదైన కేసులు తక్కువే అని చెప్పాలి.  


2018 లో మొత్తం 137 అవినీతి కేసులు నమోదైతే, రెవిన్యూ శాఖలో 37 కేసులు నమోదయ్యాయి.  ఇక ఈ ఏడాది శాఖల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రెవిన్యూ శాఖ 54 కేసులు, హోమ్ శాఖ 18 కేసులు, మున్సిపల్ శాఖ 25 కేసులు, పంచాయితీ రాజ్ శాఖ 10 కేసులు, విధ్యుత్ శాఖలో 12 కేసులు, హెల్త్ అండ్ మెడికల్ లో 13 కేసులు, న్యాయశాఖలో 5, నీటిపారుదల శాఖలో 4, కేసులు నమోదైనట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: