దేశంలో అత్యుత్తమ ప్రధానుల్లో ఒకరు నరేంద్ర మోడీ. 2013 వ సంవత్సరంలో ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎన్డీఏ ప్రకటించిన తరువాత మోడీ తనదైన శైలిలో దేశంలో పర్యటిస్తూ... ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకున్నారు.  బలమైన నాయకుడిగా ఎదిగేందుకు 2014 ఎన్నికలు ఉపయోగపడ్డాయి.  అప్పటి వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా, 2014 ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించింది.  ఆ ఏడాది ప్రధాని మోడీ వారణాసి, వడోదర నియోజక నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు.  


రెండుచోట్లా భారీ విజయం సాధించారు.  తరువాత గుజరాత్ లోని వడోదర నియోజక వర్గానికి రాజీనామా చేసిన మోడీ వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు.  2019లో బీజేపీ మరింతగా బలపడింది.  2014లో సొంతంగా 262 స్థానాల్లో విజయం సాధిస్తే 2019లో బీజేపీ 303 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది.  ఈ విజయం తరువాత మోడీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  


ఇదిలా ఉంటె, 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  ఇలా అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది.  ఈ పాలకమండలి అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు టిటిడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.  దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ. 30 కోట్ల రూపాయలతో టిటిడి శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధం అయ్యింది.  


ముంబైతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో కూడా శ్రీవారి ఆలయం ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపింది.  జమ్మూ కాశ్మీర్ లో స్ధలం కోసం అక్కడి ప్రభుత్వానికి లేఖ రాశారు.  ఇక ఇదిలా ఉంటె, ప్రధాని మోడీ నియోజక వర్గం వారణాసిలో కూడా శ్రీవారి ఆలయం నిర్మాణానికి పాలక మండలి పచ్చజెండా ఊపింది.  ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.  అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా టిటిడి ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నది.  ముంబైలో శ్రీవారి ఆలయం కోసం రూ. 30 కోట్ల రూపాయలు కేటాయించింది టిటిడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: