13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపదను సృష్టించగల, యువతఉపాధికి కేంద్రబిందువుగా నిలిచి వారికి బంగారు భవితను ఇవ్వగల అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడం, రాష్ట్రభవిష్యత్‌ను అంధకారం చేయడమేనని టీడీపీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ స్పష్టంచేశారు.  తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయన్న ఆందోళనతోనే ఆప్రాంతవాసులు రోడ్లపైకొచ్చి ఆందోళ  నలు చేపట్టారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ సమాలోచనల అనంతరం, రాష్ట్రవిభజన దృష్ట్యా నాటి కేంద్రప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఆధారంగానే విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధానిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆనాడు చంద్రబాబుకుప్పంలోనో, చిత్తూరులోనో రాజధాని పెట్టాలన్న ఆలోచన చేయలేదన్నారు. 


లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి రాజధాని నిర్మాణంకోసం ల్యాండ్‌పూలింగ్‌ విధానంద్వారా రైతులనుంచి స్వచ్ఛందంగా 34వేల 200 ఎకరాలు సేకరించడం జరిగిందన్నారు. 01-01-2015న ల్యాండ్‌పూలింగ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటిప్రభుత్వం, అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌ కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ని తీసుకొచ్చి, సీఆర్డీఏకి అనుబంధంగా  అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ని చట్టబద్ధంగా ఏర్పాటు చేసినట్లు కనకమేడల వివరించారు.  ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా 34,280ఎకరాలు, ల్యాండ్‌ అక్విజేషన్‌ద్వారా 4,300ఎకరాలు,  ప్రభుత్వభూములన్నీ కలిపి 15,167ఎకరాలు, పట్టాభూములకు సంబంధించి 3,280 ఎకరాలుంటే, ట్యాంక్స్‌అండ్‌రివర్‌, వాటర్‌బాడీ ల్యాండ్స్‌ 6,441 ఎకరాలుంటే, లంకభూములు 1533ఎకరాలుకాగా, కొండప్రాంతం, ఇతర పోరంబోకు భూములు 1109ఎకరాలుంటే,  రిజర్వ్‌ఫారెస్ట్‌ 581ఎకరాలైతే, విలేజ్‌సైట్‌భూములు 642ఎకరా లని, హ్యాబిటేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ల్యాండ్స్‌ 268, వాగులు,రోడ్లు, డొంకలు  1313 ఎకరాలుకాగా, మొత్తంభూమి అంతా కలిపి 53,748ఎకరాలుందని, ఇదంతా స్వచ్ఛంద ంగానే సేకరించడం జరిగిందని రవీంద్రకుమార్‌  చెప్పారు. 


భూములిచ్చిన  28,538 మంది రైతులకు మంచిప్యాకేజీ, ప్లాట్లు, కౌళ్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడమైందన్నా రు. అమరావతి సీడ్‌ఏరియాలో 4,283గ్రామాలుంటే, సీడ్‌కేపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌ 6.8 చదరపుకిలోమీటర్లు ఉందన్నారు. రైతులకు 64,710ప్లాట్లు ఇవ్వగా, 39,299ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నవి 25,488 ఉన్నాయ న్నారు. ఈ ఒప్పందాలన్నీ ఏపీ కేపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ చట్టం కిందే జరిగాయని, ఏప్రభుత్వం వచ్చినా ఇవన్నీ విధిగా అమలు జరపాల్సిందేనని కనకమేడల తేల్చిచెప్పారు. ఇంతజరిగినా ఇవేమీ పట్టించుకోకుండా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి,  కేపిటల్‌ని మూడురాజధానులుగా మారుస్తామనిచెప్పడం వల్ల వేలకుటుంబాలు రోడ్డున పడ్దాయన్నారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అని కట్టుకథలు చెప్పిన ప్రభుత్వం, దాన్ని నిరూపిం చలేకపోయిందన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, రాజధాని ప్రకటనవరకు జరిగిన భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ల వివరాలను పరిశీలిస్తే వాస్తవాలు ప్రభుత్వానికి బోధపడతాయన్నారు. 

 

రాజధాని పరిధిలోకి రానిప్రాంతాల్లో ఎవరో ఒకరిద్దరు వ్యక్తిగతంగా కొనుగోలుచేసిన భూములవివరాలు చెప్తూ, ప్రజల్ని  గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. వైసీపీవచ్చాక సింగపూర్‌ ప్రాజెక్ట్‌, ప్రపంచబ్యాంక్‌ నిధులు వెనక్కుపోయాయన్నారు. ప్రజలనుంచి సేకరించాల్సిన భూమిని వదిలేయడం,  రైతులమధ్య చిచ్చుపెట్టడం, గ్రీన్‌ట్రైబ్యునల్‌లో, కోర్టుల్లో కేసులువేయడం ద్వారా అమరావతి పనులు జరక్కుండా అడ్డుకున్నది వైసీపీవారు కాదా అని ఎంపీ ప్రశ్నించారు.  వైసీపీ ఎన్నిచేసినా, రూ.9వేలకోట్లవరకు పనులుపూర్తిచేసి, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ఉద్యోగుల గృహాలను టీడీపీప్రభుత్వం నిర్మించిందన్నారు. కేంద్రంనుంచి నిధులు తీసుకురావాలన్న ఆలోచన జగన్‌కిఉంటే, తన ఎంపీలతో తక్షణమే రాజీనామా చేయించాలని కనకమేడల సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: