రాజధానికి రూ.లక్షా10వేలకోట్లు ఖర్చుచేసే స్తోమత తమకులేదని, అమరావతి నిర్మించలేమని చెబుతూ, రాజధానిని మారుస్తున్నట్లు చెబుతున్న వైసీపీనేతల మాటలు ముమ్మాటికీ అవాస్తవమని టీడీపీనేత స్పష్టంచేశారు. కేపిటల్‌ఏరియాలోని భూములను అభివృద్ధి చేసుకుంటూనే రాజధానిని నిర్మించేలా గతప్రభుత్వం సింగపూర్‌సంస్థతో 22-02-2016లో మాస్టర్‌ప్లాన్‌ తయారుచేసిందన్నారు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌గా అమరావతిని అభివృద్ధిచేసేలా నార్మన్‌ఫోస్టర్స్‌సంస్థతో కలిసి డిజైన్లు రూపొందిం చడమైందన్నారు. అన్నివిభాగాలకు, నిర్మాణాలకు, రోడ్లకు పోగా ప్రభుత్వంవద్ద చివరకు మిగిలే భూమి మొత్తం 10వేలఎకరాలని, ఆభూమితోనే రాజధానిని నిర్మించవచ్చన్నారు. 


1994లో హైదరాబాద్‌చుట్టుపక్కల భూమివిలువ ఎంత ఉండేదో, సైబరాబాద్‌, హైటెక్‌ సిటీ నిర్మించాక ఎన్నిరెట్లుపెరిగిందో మనరాష్ట్రపాలకులు తెలుసుకోవాలన్నారు.  తండ్రి అధికారంతో  లక్షకోట్లు కొట్టేసినా, ఆ వ్యక్తిఏమీచేయలేదని, ఏవిధమైన అవినీతి జరగలేదని లెక్కలుతయారుచేసిన అనుభవజ్ఞుడైన ఆడిటర్‌ విజయసాయికి ఇవన్నీ తెలియవా అని కనకమేడల ప్రశ్నించారు. సీఆర్డీఏతో కలిసి, కాంప్రహెన్సివ్‌ ఫైనాన్స్‌ప్లాన్‌ ఫర్‌ ప్రాజెక్ట్‌ అమరావతి కోసం ఉత్తర్వులిచ్చిన రాష్ట్రప్రభుత్వం, జీవోఎం.ఎస్‌.నెం-50ని 05-02-2019న విడుదలచేసిందన్నారు. సుదీర్ఘంగా చర్చించాక, ఆచరణాత్మ కమైన ఫైనాన్స్‌ప్లాన్‌ ఇచ్చిన జగన్‌ప్రభుత్వం, దాన్ని విస్మరించేలా అమరావతి నిర్మాణాన్ని ఊహాలకేంద్రంగా పేర్కొనడం తగదన్నారు. 

 

కొత్తరాజధాని నిర్మాణంకోసం  ఆనాటి ప్రభుత్వం రూ.55,343కోట్లకు అంచనాలు తయారుచేసిందన్నారు. దీనిపై లక్షకోట్లని దుష్ప్రచారం చేస్తూ, తప్పించుకునేధోరణితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెస్తామనిచెప్పినవారు ఇప్పుడు ఆఊసే ఎత్తడంలేదన్నారు.  రాజధానిలోని ప్లాట్లను అమ్మి, వాటిద్వారా నిధులు సేకరించే అవకాశంఉన్నా, దాన్ని  వదిలేసి, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని కనకమేడల మండిపడ్డారు. 13జిల్లాల యువత కలలప్రాజెక్ట్‌ అయిన అమరావతిని నిర్వీర్యంచేస్తూ, ఇప్పటికే అభివృద్ధిచెందిన విశాఖలో రాజధాని కడతామనడం ఎంతవరకు సబబని, ఎవరికోసమని  ఆయన ప్రశ్నించారు.  


రాష్ట్రప్రభుత్వం రూపాయి ఖర్చులేకుండా ఇప్పటివరకు అమరావతినుంచే పాలనచేసిందని, జీవోనెం.50 అమలుద్వారా వచ్చే లక్షలకోట్ల ఆదాయం, 13జిల్లాల అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఆలోచన రాష్ట్రపాలకులకు ఎందుకు రావడం లేదన్నారు. 10వేల ఎకరాలను సక్రమంగా వినియోగించినట్లయితే లక్షలకోట్ల ఆదాయం ఇప్పటికే వచ్చి ఉండేదన్నారు. డబ్బులులేవని చెప్పేపాలకులు, రాజధాని ప్రాజెక్ట్‌ అమలుని తెలుగుదేశానికి అప్పగిస్తే, ఎలాచేయాలో, ఆదాయం ఎలా తీసుకురావాలో, దాన్ని ప్రజాసంక్షేమానికి ఎలా ఉపయోగించాలో చేసి చూపిస్తుందన్నారు. ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు మేలుచేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్ష సలహాలు, సూచనలు స్వీకరించి, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని టీడీపీఎంపీ హితవుపలికారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: