ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు వేడి వేడిగానే ఉంటాయి. అటువైపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నవాళ్లు ఉంటె.. ఇటు వైపు 40 ఏళ్ళ వయసు ఉన్న యువకుడు సింహంలా ఉన్నాడు. ఆంధ్రాలో ప్రజలకు ప్రశాంతత లేకుండా పోయింది ప్రతిపక్ష పార్టీ చేసే రాజకీయం వల్ల. ఇంకా అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అమరావతి రాజధానిని పక్కన పెట్టడంపై విమర్శలు భారీగా వస్తున్నాయి. 

 

గత ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం దానిని కాదని మూడు రాజధానులను ప్రకటన చేసింది. దీంతో రాజధాని ఎలా మారుస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. దింతో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. 

 

అయితే రైతులు స్వచ్చందంగా రోడ్డుపైకి వచ్చి గొడవ చేయడంతో రైతులకు బీజేపీ, సీపీఐ సంఘీభావం తెలిపింది. రైతుల తరపున పోరాటం చేస్తామని ఆ పార్టీలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం అమరావతి వెళ్లి రైతుల సమక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేయడం లేదు.  

 

ఏదో పార్టీని ఎదిరించాలంటే ఎదిరించాలి అనేలా వెళ్లి కలిసి వస్తున్నారు. లేదంటే ప్రెస్ మీట్ పెట్టి సపోర్ట్ చేసినట్టు హంగామా చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతులతో కలిసి పోరాటం చేస్తామని బీజేపీ చెప్తూ వారితో కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధం అవుతున్న సమయంలో టీడీపీ మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. 

 

రైతులకు మద్దతుగా నిలిచే పోరాటం చేసే ఛాన్స్ ను తెలుగుదేశం పార్టీ మిస్ చేసుకుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమరావతిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీనే రైతులకు మద్దతుగా నిలవకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎందుకు టీడీపీ చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. మరి వీరి ప్రశ్నలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: