ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్ల ఎక్కువగా పిలిచే పేరు విద్యనేర్పే  గురువు పేరు.. తల్లిదండ్రుల పట్ల భయం భక్తితో లేకున్న చదువు చెప్పే గురువు పట్ల భయభక్తులతో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే నేటి కాలం చదువులు పూర్తిగా కలుషితమై పోయాయి. చదువు నేర్పేవారే సంస్కార హీనులుగా మారుతుంటే. అతని దగ్గర చదువుకుంటున్న విద్యార్ధుల పరిస్దితి గురించి చెప్పక్కర్లేదు.

 

 

ఇకపోతే నేటి కాలంలో ఆడపిల్ల ఒంటరిగా వెళ్లితే క్షేమంగా ఇల్లు చేరుతుందనే నమ్మకం ప్రతి తల్లిదండ్రుల్లో సన్నగిల్లింది. ఇందుకు కారణం నేడు సమాజంలో పెట్రేగి పోతున్న కామాంధుల దాడులు. ఇక మామూలు ఆడపిల్లల పరిస్దితి ఇలా ఉంటే గిరిజన హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థినిలకు ఎంతమేర రక్షణ ఉందనే విషయాన్ని ఎంతవరకు అధికారులు ఆలోచిస్తున్నారు.. వారి పేదరికమే మానప్రాణాలను పణంగా పెట్టి దూరంగా చదువుకునేలా చేస్తుంది. దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు కామాంధులు ఇలాంటి యువతులు, బాలికల పట్ల ఎంత నీచంగా ప్రవర్తించారో తెలిస్తే ఒళ్లు గగుర్పొడవటం ఖాయం. ఇంతకు జరిగింది ఏమిటంటే..

 

 

ఆసిఫాబాద్ జిల్లాలో ట్రైబల్ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు గర్బం దాల్చడం కలకలం రేపుతోంది. హస్టల్లో ఉండే పది మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ పరీక్షల అనంతరం నమ్మలేని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట. అప్పటికే ఆ పది మందిలో మగ్గురు అమ్మాయులకు ప్రెగ్నెస్సీ టెస్ట్ పాజిటీవ్ రాగా, అందులో ఒకరు 3 నెలల గర్భిణీ అని తేలింది.

 

 

ఇకపోతే అధికారులు హస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు ఈ విషయం రెండు నెలల ముందే తెలిసినా కూడా.. సమాచారం బయటకు పొక్కనివ్వకుండా దాచిన హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: