అనాది నుంచి రాజధానిగా కలిసిరాని అమరావతి. అమరావతి పేరు పెట్టాక అనర్దాలు చుట్టుముట్టాయి. అలనాడు ఈ ప్రాంతాన్ని ధరణి కోట పేరుతో రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహనులు. ధరణికోట అనే పేరును మార్చి ఈ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టటంతో శాతవాహనుల రాజధాని కూలిపోయిందని చెబుతారు. అనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజధానికి అమరావతి పేరు పెట్టటం వల్ల అతని రాజ్యం కూలిపోయింది. పంచారామాల్లో ప్రధమ ఆరామంగా ఉన్న అమరేశ్వరాలయం కొలువై ఉన్న గ్రామాన్ని అమరావతి అనే పేరుతో పిలుస్తుండటంతో  పంచారామంగా ఉన్న అమరేశ్వరాలయం కూడా శోభ కోల్పోయింది. 

తదనంతరం ఇదే అమరావతి పేరు మరలా రాజధాని గా తెరపైకి తేవటంతో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. అనంతరం 2019 . ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలైయ్యారు. పార్టీ పరంగా కూడా వలసల పర్వంతో ఇబ్బందులు వచ్చాయి. ఈ ప్రాంతానికి అమరావతి పేరు పెట్టే వరకు 29 గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్న సారవంతమైనభూములుగా ఉన్నాయి.ఈ 29 గ్రామాలకు రాజధానిగా అమరావతి పేరు పెట్టిన అనంతరం 29 గ్రామాల పచ్చని పొలాలు డ్రై ల్యాండ్స్ గా మారి బీడువారిపోయాయి. అదే తరహాలో అమరావతి పేరుతో రాజధాని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కు కూడా అమరావతి అరిష్టంతో మొదలైందని చెప్పాలి.


గతంలో ఎన్నడూ లేని విదంగా ఇసుక సమస్య ప్రభుత్వాన్ని కంపించింది. అదే విదంగా రాజధానిలో రైతుల ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఇదే అమరావతి రాజధాని పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా రాజధానిగా అమరావతిని ఏ ప్రభుత్వం కొనసాగినా అరిష్టాలు తప్పవని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రభుత్వ అధికారిక లేఖలు, ఇత్తర్వులు పాలనా పరమైన అంశాల్లో అమరావతి పేరుని తొలగిస్తే కొన్ని  సమస్యలు తొలగిపోతాయనేది వాదన. బ్రహ్మంగారు చెప్పినట్టు మంగళగిరి రాజధాని అయితే అన్ని అనార్దాలకు తెరపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: