రాజధాని తరలిస్తే ఊరుకోమని రాజధాని కోసం ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నామని రాజధాని ఐదు కోట్ల ప్రజల హక్కు అమరావతి రాజధాని అని దీనికోసం దేనికైనా సిద్ధమేనని అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. మంగళగిరి సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష కమిటీ సమావేశం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, టిడిపి నియోజకవర్గ మాజీ కన్వీనర్ పోతినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ రాజధాని కోసం 32 వేల ఎకరాలు భూమిని రైతులు అందజేశారని తమ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలని కోరుకున్నారని ఆ ప్రకారమే రాజధాని నిర్మాణం సచివాలయం అసెంబ్లీ అనేక భవనాలు నిర్మాణం కొనసాగుతున్నాయని అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసాధింపు చర్యగా అమరావతిలో ఉన్న రాజధానిని మూడు ప్రాంతాలకు తరలిస్తామని చెప్పటం తుగ్లక్ పాలన గుర్తుకు తెస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కు విజయవాడ-గుంటూరు మధ్య సెంటర్ పాయింట్ గా అమరావతి ఉందని అన్నారు.అమరావతి నిర్మాణం కల ఐదు కోట్ల ప్రజలది అని అన్నారు. అమరావతి రాజధాని తరలిస్తే పోరాటానికి సిద్ధపడాలని తిరుపతయ్య పిలుపునిచ్చారు.

టిడిపి నియోజకవర్గ  మాజీ ఇన్చార్జులు గంజి చిరంజీవి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాటానికి సిద్ధపడాలని అన్నారు. ప్రపంచ దేశాలలో అమరావతి పేరు ఆంధ్రప్రదేశ్ రాజధాని గా పేరుగాంచింది అని అన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ఎస్సీ,ఎస్టీ,బి సి,ఓసి లక్కీ చెందినవారు కి రాజధాని ఒక ప్రతిష్ట లాంటిదని.అలాంటి రాజధానిని తరలించాలని అనుకోవటం అంత తేలికైన పని కాదు అని,మూడు ప్రాంతాల ప్రజల్లో చిచ్చు రేపేఎందుకే ఈ ప్రయత్నం మని అన్నారు.సోమవారం నుండి మంగళగిరి నుండి విజయ పోరాటానికి శ్రీకారం చుడుతున్నమనీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ షేక్ సలీం మాట్లాడుతూ రాజధాని సాధన కోసం రాజధాని కాపాడుకోవటం కోసం పోరాటానికి తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని అఖిలపక్ష కమిటీ చేసే పోరాటంలో పాలు పంచుకుంటా మనీ అన్నారు.

అమరావతి పరిరక్షణ సమితి చైర్మన్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని తరలిపోకుండా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని అందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ,సిపిఎం, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ, లక్ష్మీ నరసింహ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్, చాంబర్ ఆఫ్ కామర్స్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ చెందినవారు అఖిలపక్ష కమిటీ గా ఏర్పడ్డారు సోమవారం నుండి మంగళగిరి నుండి పోరాటం కి శ్రీకారం చుట్టాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ  సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచర్ల కాశయ్య, బొర్ర మల్లికార్జున రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలగపాటి విలియం జ్యోతి బాస్, పటాన్ ఖాసిం ఖాన్, నూతక్కి ఏడుకొండలు, జనసేన పార్టీ జిల్లా నాయకులు చల్లపల్లి శ్రీనివాస రావు, రావి రమా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామనాథం పూర్ణచందర్రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి  వీసం వెంకటేశ్వరరావు, లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, ఆకుల శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయి ప్రసాద్, డాక్టర్ గిరిజ, డాక్టర్ ఆదినారాయణ, సిపిఐ నాయకులు నందం బ్రహ్మేశ్వర రావు, గంజి వెంకటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు కూరపాటి సుబ్బారావు, మాచర్ల ఏసోబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాజధాని సాధన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ సోమవారం నుండి పోరాటం రాజధాని సాధన కోసం చేయనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: