ఈ భూమిపై మానవులు ఎన్నో కోట్ల మంది ఉన్నప్పటికీ, మన బుర్రలో ఒక్కొక్కరిది ఒక్కోరకమైన ఆలోచన అని, ఇన్నికోట్ల మందిలో ఏ ఒక్కరి వేలి ముద్రలు మరొకరితో ఎలా కలవవో, దాదాపుగా అదే విధంగా మనలోని ఆలోచనలు కూడా ఒకరిలా మరొకరివి ఉండవు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇక మనలో కొందరి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, పావలా కోసం కక్కుర్తిపడి ఏకంగా వంద రూపాయలు పోగొట్టుకునే వారు కూడా అక్కడక్కడా కొందరు ఉన్నారు. ఇక అచ్చంగా ఇప్పుడు ఈ విధంగా ఆలోచించే వ్యక్తి గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తమిళనాడులోని తూతుక్కుడి జిల్లాలో గల ఒక మారుమూల ప్రాంతంలో నివసించే తంగవేలు అనే యువకుడు, 

 

కక్కుర్తి పోయి చేసిన ఒక చిన్న తప్పిదమే మొత్తం అతడి జీవితాన్నే పూర్తి విషాద మాయం చేసింది. వివల్లోకి వెళ్తే, రెండు రోజుల క్రితం ఇంట్లో సరుకులు నిండుకోవడం, అలానే ఇంటి అద్దె తదితరాలన్నీ బాకీ ఉండడంతో, తన చేతికి ఉన్న పదిన్నర వేల రూపాయల విలువచేసే ఉంగరాన్ని తంగవేలు చేతికి ఇచ్చింది అతని తల్లి. ఆ ఉంగరాన్ని నగల దుకాణంలో అమ్మి డబ్బులు తీసుకురమ్మని చెప్పడంతో, అది తీసుకుని బయలుదేరిన తంగవేలు, తమ ఊరి నుండి ఆటోలో వెళితే రాను యాభై, పోను యాభై, వెరసి మొత్తం వంద రూపాయలు ఖర్చు అవుతాయని కక్కుర్తితో పది రూపాయలతో టికెట్ తీసుకుని బస్సు ఎక్కాడు. అసలే బస్ మొత్తం రద్దీగా ఉండడంతో అలానే బస్సులో ఇరుక్కుని నిలబడ్డాడు,

 

చివరికి సిటీకి చేరుకొని జేబులో చూసుకుంటే ఉంగరం పోయిందని గ్రహించిన తంగవేలు, ఏమిచేయాలో పాలుపోక దిగాలుగా ఇంటికి చేరుకున్నాడు. అయితే అప్పటికే అప్పులవాళ్ళు అతని తల్లితో గొడవపడటం చూసాడు.  ఉంగరం అమ్మి డబ్బులు తెచ్చావా అని తల్లి అడిగిన ప్రశ్నకు గుటకలు మ్రింగిన తంగవేలు, జరిగిన విషయాన్ని ఆమెకు వివరించాడు. డబ్బులేకపోవడంతో ఇంటి ఓనర్ వారిని రేపు ఉదయంకల్లా ఖాళి చేయమని హెచ్చరించడం జరిగింది. ఇక జరిగిన ఘటనతో తీవ్రంగా కలత చెందిన అతని తల్లి, అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారి నిద్రలేచి చూసేసరికి తల్లి శవమై ఫ్యానుకు వేలాడడం చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు తంగవేలు. ఇక ఈ ఘటన విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసారు.

 

అయితే మొదటి నుండి తంగవేలు ఈ విధంగానే కక్కుర్తిగా వ్యవహరిస్తూ ఉండేవాడని, అలానే తండ్రి మరణం తరువాత తల్లికి చేదోడువాదోడుగా ఉండవలసింది పోయి, ఆమె నగలు మొత్తం అమ్మి ఇల్లు గడిపే స్థితికి తెచ్చాడని, కాగా నిన్న ఇంటి ఓనర్ సహా పలువురు అప్పుల వాళ్ళు గట్టిగా డబ్బులు కట్ట లేదని గొడవ చేయడంతో, ఎంతో ఆవేదన చెంది, ఆ పెద్దావిడ ఆత్మహత్య చేసుకుందని, ఇటువంటి కొడుకు ఏ తల్లికి ఉండకూడదని ఇరుగుపొరుగు వారు తంగవేలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వృద్ధురాలి మరణంతో ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలముకున్నాయి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: