ఎక్కడైనా పిజ్జా మన ఆకలిని తీరుస్తుంది. కానీ ఇదేంటి వీళ్ళు ఇక్కడ పిజ్జా మూడు ప్రాణాలు కాపాడింది అంటున్నారు అని అనుకుంటున్నారా. దానికోసం ఇది పూర్తిగా చదవండి. ఫ్లోరిడా కు చెందిన చెరిల్ ట్రేడ్ వె అనే యువతి ఉంది, ఎంతో ఇష్టపడి తన ప్రియుడిని ఏరి కోరి పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసింది చెరిల్. ఇక వారిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. వివాహం తరువాత ఒకింత శాడిస్ట్ లా మారి అప్పుడప్పుడు తమను ఇబ్బంది పెడుతున్న భర్తను ఎలాగో భరిస్తూ వచ్చింది చెరిల్. అయితే ఒకరోజు హఠాత్తుగా తన భర్త కోపోద్రిక్తుడై ఇంటికి వచ్చి, తనను, తన ఇద్దరు పిల్లలను చంపేయడానికి ప్రయత్నిస్తుంటే, అడ్డుపడిన చెరిల్ అతడితో కాసేపు గట్టిగా పోరాడింది. 

 

కాసేపు వారిద్దరి మధ్య కొద్దిపాటి పెనుగులాట జరిగింది. ఇక ఆ ఘటనతో తప్పనిసరిగా తమ ముగ్గురినీ భర్త చంపేయడం ఖాయం అని భావించిన చెరిల్, ఎలాగైనా అతడి నుండి తప్పించుకోవాలని తెలివిగా ఒక ఆలోచన చేసింది. మమ్మల్ని చంపేయి, కాకపోతే ఒకసారి పిల్లలవైపు చూడు, వారి మొహాలు చూస్తుంటే ఎంతో జాలి వేస్తోంది, వారు ఎప్పటినుండో ఎంతో ఆకలిగా ఉన్నారు. ముందుగా ఇద్దరికీ పిజ్జా ఆర్డర్ చేస్తాను, అది రాగానే వారు తిన్నతరువాత నువ్వు చెప్పినట్లుగానే మమ్మల్ని చంపేయి అంటూ అతడిని దీనంగా ప్రాధేయపడింది. ఎట్టకేలకు కాసేపటికి పిల్లల దీనమైన మొహాలు చూసి కొంత కరిగిన ఆమె భర్త, పిజ్జా ఆర్డర్  చేయి,,అయితే ఫోన్ చేయకుండా యాప్ ద్వారా ఆర్డర్ చేయి అంటూ చెరిల్ కి చెప్పాడు. 

 

అదే అదనుగా భావించి తన మొబైల్ ఫోన్ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ పెట్టిన చెరిల్, కింద రిమార్క్స్ కాలం దగ్గర, 'ప్లీజ్ హెల్ప్, గెట్ 911 టూ మీ' అని రాసి పిజ్జా ఆర్డర్ పెట్టింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, తరచు ఆ పిజ్జా హట్ నుండి పిజ్జాలు ఆర్డర్ ఇచ్చే చెరిల్, ఈ రోజు మాత్రం రిమార్క్స్ కాలంలో అలా హెల్ప్ కోసం మెసేజ్ పెట్టింది అంటే, తప్పకుండా ఆమె ఏదో ప్రమాదంలో ఉండి ఉంటుందని భావించిన పిజ్జా హట్ యాజమాన్యం, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో సెటిల్ ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు వేసి ఉండడంతో పరిస్థితిని అర్ధం చేసుకుని కొంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు, చివరికి ఇంట్లోకి ప్రవేశించి చెరిల్ భర్తను బంధించారు. కాగా ఈ ఘటనతో చెరిల్ సహా ఆమె పిల్లలు కూడా ప్రాణాలతో బ్రతికిపోయారు. అనంతరం పిజ్జా హట్ వారు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెల్పింది చెరిల్.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: