మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మదుపు చేయటంతో పాటు ఎన్నో ఆర్థిక ప్రణాళికలను కూడా వేసుకుంటూ ఉంటాం. అదే విధంగా ఈ సంవత్సరం చివరి తేదీలోపు తప్పకుండా చేయాల్సిన పనుల గురించి గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 31వ తేదీన ప్రధానంగా పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ గడువు ముగుస్తోంది. 
 
ఆధార్ - పాన్ గడువు గతంలో చాలాసార్లు పెంచినా మరోసారి పెంచే అవకాశాలు ఐతే లేవని సమాచారం. ఎస్బీఐ కస్టమర్లు మాగ్నిటిక్ స్ట్రిప్ తో కూడిన ఏటీఎం కం డెబిట్ కార్డును వినియోగిస్తుంటే భారీగా నష్టపోక తప్పదు. ఎస్బీఐ డిసెంబర్ 31వ తేదీ వరకే పాత కార్డులు చెల్లుబాటు అవుతాయని ఆ తరువాత పాత కార్డులు చెల్లుబాటు కావని ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఐటీ రిటర్న్స్ ను సమర్పించకపోతే 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ను 5వేల రూపాయల ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు. 
 
డిసెంబర్ 31వ తేదీ తరువాత పన్ను రిటర్నులకు సంబంధించిన పెనాల్టీ భారం 10,000 రూపాయలు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీలోపు కొన్ని పనులు చేయకపోతే నష్టాలు ఎలా ఉన్నాయో డిసెంబర్ 31వ తేదీ తరువాత ప్రజలకు కొన్ని లాభాలు కూడా కలగనున్నాయి. డిసెంబర్ 31వ తేదీ వరకే నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలను చెల్లించాలి. 2020 జనవరి 1 నుండి నెఫ్ట్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవు. జనవరి 1 నుండి నెఫ్ట్ లావాదేవీలు 24x 7 ఎప్పుడైనా చేసుకోవచ్చు. 
 
ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎం నుండి డబ్బులు రాత్రి 8 నుండి ఉదయం 8 మధ్య విత్ డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10,000 పైబడిన లావాదేవీలకు మాత్రమే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ వినియోగదారులు ఎస్బీఐ ఏటీఎంలలో చేసే లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జనవరి 1వ తేదీ నుండి ఎంపిక చేసిన లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు కూడా ఉండవు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: