భార‌త‌దేశంలో...అన‌ధికారికంగా అయిన‌ప్ప‌టికీ...ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశం అనే తేడాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. సంస్కృతి, వ్య‌వ‌హారిక శైలి స‌హా అనేక అంశాల్లో తేడా ఉంటుంది. అయితే, ఉత్త‌రాదితో పోలిస్తే..మ‌నం ఎంతో మెరుగ్గా ఉన్నామ‌ని...తాజాగా మ‌రోమారు స్ప‌ష్టమ‌వుతోంది. చలికి ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఈ ఏడాది శీతాకాలంలో అత్యంత చలి రోజుగా శనివారం రికార్డుకెక్కింది. 2013 డిసెంబర్‌ 30న ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే 1996 డిసెంబర్‌ 11న 2.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు దాదాపు 13 ఏండ్ల తర్వాత ఆ స్థాయిలో చలి పెరుగుతుండటం గమనార్హం.

 

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ దాల్‌ సరస్సు గడ్డకడుతున్నది. సరస్సుపై మంచు పలుకలు తేలియాడుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ చలి వణికిస్తున్నది. పొగమంచు కారణంగా హర్యానాలోని ఢిల్లీ-జైపూర్‌ రహదారిపై వరుసగా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉన్నది. శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లో మైనస్‌ 5.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.విపరీతమైన చలి, మంచు వల్ల నగరంలో చాలా వరకు నీటి సరఫరా పైప్‌లైన్లు గడ్డకట్టిపోయాయి. లడఖ్‌లోని లెహ్‌లో శనివారం ఉష్ణోగ్రతలు మైనస్‌ 19.1 డిగ్రీలు, ద్రాస్‌లో మైనస్‌ 28.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. గుల్మార్గ్‌లో మైనస్‌ 7.5 డిగ్రీల సెల్సియస్‌, పహెల్‌గామ్‌లో మైనస్‌ 11.2 డిగ్రీల సెల్సియస్‌, ఖ్వాజిగుండ్‌లో మైనస్‌ 10.8 డిగ్రీల సెల్సియస్‌, కోకర్‌నాగ్‌లో మైనస్‌ 7.6 డిగ్రీల సెల్సియస్‌, కుప్వారాలో మైనస్‌ 6.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

 

 

మ‌రోవైపు, వాతావరణంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ల్లీ విమానాశ్రయం పక్కన ఉన్న పాలం ప్రాంతంలో విపరీతమైన పొగమంచు పడటంతో అక్కడ కనీసం పదడుగుల దూరంలో ఉన్న వ్యక్తులు కూడా ఒకరికొకరు కనిపించని పరిస్థితి నెలకొన్నది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం నెలకొంది. అలాగే రైళ్ల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం పడింది. పొగమంచు కారణంగా దాదాపు 24 రైళ్లను రెండు నుంచి 5 గంటలు ఆలస్యంగా నడిపినట్టు రైల్వే అధికారులు తెలిపారు.దట్టమైన పొగమంచుకు వాయు కాలుష్యం తోడవడంతో వాతావరణంలో గాలి నాణ్యత క్షీణించిపోయింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా హర్యానా రేవరి జిల్లాలోని ఢిల్లీ-జైపూర్‌ రహదారిపై వరుసగా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో 12 మంది గాయాలపాలయ్యారు. ఢి ఇక రాజస్థాన్‌లోనూ చలిగాలులు వణికిస్తున్నాయి. సికార్‌ జిల్లాలోని ఫతేపూర్‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి మైనస్‌ 4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పంజాబ్‌, హర్యానా, ఒడిశా రాష్ర్టాలు కూడా చలి పులి బారిన పడి విలవిల్లాడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: