సమాజంలో కొందరి జీవితాల్లో అనుమానం అనే భూతం పర్మినెంట్‌గా తిష్టవేసుకుని కూర్చుంటుంది. ఒక మనిషిలోకి ఏదైతే ప్రవేశింపకూడదనుకుంటామో అదే ప్రవేశిస్తే ఆ జీవితం నరకంగా ఉంటుంది.. అనుమానంతో పచ్చని సంసారాలు కూడా నాశనమైన సందర్బాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు కూడా విడిపోయాయి. చివరికి ప్రాణాలను సైతం తీసే శక్తి ఈ అనుమానానికి ఉంది. అందుకే అంటారు. అనుమానం పెనుభూతం అని.

 

 

ఇక ఓ వివాహితకు వచ్చిన అనుమానం ఆమె పసుపుకుంకుమలను ప్రమాదంలో పడేసింది. అదెలాగో తెలుసుకుందాం. ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలో ఉంటున్న భార్యభర్తల మద్య వచ్చిన అనుమానం చివరికి భర్త మర్మాంగాన్ని కోసే పరిస్దితిలోకి తీసుకెళ్లింది. అది కూడా అనుమానంతోనే ఇకపోతే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంటి సమితిలోని ఉదయపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. స్థానికంగా పనులు లేకపోవడంతో అతను వేరే రాష్ట్రంలో కూలీగా వలస వెళ్లాడు.

 

 

ఆ తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన యువకుడు ఏ పనీ చేయకుండా నెలల తరబడి ఇంటి వద్దే ఉండటంతో భార్యకు అనుమానం మొదలైంది. ఈ దశలో భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రోజూ అతడితో గొడవకు దిగేది. దీంతో ఇరువురి మధ్య రోజు తగువు జరుగుతుండేదట. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఆ యువకుని భార్య ఎలాగైనా అతనిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురు చూసింది.

 

 

గత ఆదివారం ఆమెకు అవకాశం లభించడతో.  భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో అతని కాళ్లు, చేతులు కట్టేసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. దాదాపు 90 శాతం మర్మాంగం తెగిపోవడంతో అతని ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి  స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కోరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు తెంతులికుంటి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: