ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి లక్ష ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసి సత్వరంగా పరీక్షలు జరిపి తక్కువ రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించి సత్వరం ఉద్యోగాల్లో చేర్పించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని  గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో  విధుల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ... గ్రామ సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి మూడు నెలలు అయింది. 

 

 

 

 అయినప్పటికీ ఇంకా జీతాలకు నోచుకోలేదు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి సరే కానీ జీతాల మాట ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి అని ఆనంద పడాల లేక మూడు నెలల నుంచి జీతం రావట్లేదని బాధ పడాలా అర్థం కావట్లేదు అంటూ అయోమయంలో పడుతున్నారు సచివాలయ ఉద్యోగులు. మూడు నెలల పాటు జీతాలు చెల్లించకపోతే తమ జీవనం గడిపేదెట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు నిర్వహించి తొందరగా శిక్షణ ఇచ్చి వీధుల్లో చేర్పించినట్లు గానే జీతాలు కూడా సత్వరంగా చెల్లించండి జగన్ సార్ అంటూ వేడుకుంటున్నారు. ప్రస్తుతం మూడు నెలల నుంచి జీతాలు అందక పోవడంతో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 

 

 

 

 సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి  మూడు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. దీంతో మాకు జీతాలు ఇవ్వండి సారు అంటూ  కోరుతున్నారు సచివాలయ ఉద్యోగులు. ఇక సచివాలయ ఉద్యోగుల అందరికీ సత్వరంగా వేతనాలు చెల్లించేలా... చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సహా... గణాంకాల విభాగానికి లేఖరాశారు ఉద్యోగులు. గ్రామ సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి మూడు నెలలు గడుస్తున్నది  అని లేఖలో గుర్తు చేశారు సచివాలయ ఉద్యోగులు.

మరింత సమాచారం తెలుసుకోండి: