పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా మొన్నటి వరకు ఉత్తర ప్రదేశ్ లో రగడ జరిగిన సంగతి తెలిసిందే.  ఈ రగడ నుంచి బయటపడేందుకు యూపీ సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది.  ఈ కఠిన నిర్ణయాలతో ఉదృతంగా జరుగుతున్న అల్లర్లు కాస్త ఒక్కసారిగా సద్దుమణిగాయి.  ఈ అల్లర్ల నుంచి బయటపడిన యూపీ, ఇప్పుడు నష్టనివారణ చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆందోళన కారుల్లో ఎవరైతే దాడులకు పాల్పడ్డారు వారిని గుర్తించి వారి ఆస్తులను జప్తు చేసే పనిలో పడింది.  


ఇప్పటికే 498 మందిని పోలీసులు గుర్తించారు.  వారికీ నోటీసులు జారీ చేసింది.  దాడులు చేస్తే ఇకపై ఇలాంటి చర్యలు ఉంటాయని కఠిన నిర్ణయం తీసుకోవడంతో యూపీ ఒక్కసారిగా కూల్ అయ్యింది. ఇలా యూపీ ఒక్కసారిగా కూల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.  దేశంలో ఢిల్లీ కంటే యూపీ నే డేంజర్.  యూపీ ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్టుగా ఉన్నది.  అందుకే యూపీలో అల్లర్లు చేయడానికి సిద్ధం అయ్యింది.  యూపీలో అనేక రగడ సృష్టించేందుకు సిద్ధం అవుతున్నది.  


ఇందులో భాగంగానే నిన్నటి రోజున ప్రియాంక గాంధీ స్కూటర్ పై యూపీకి వెళ్ళింది.  అక్కడ అల్లర్లలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళింది.  అయితే అంతకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీ లో పర్యటించాలని వెళ్ళినపుడు, 144 సెక్షన్ అమలు ఉన్నది కాబట్టి అనుమతి లేదని చెప్పారు.  పోలీసులు అనుమతి ఇవ్వకపోవంతో వెనుదిరిన కాంగ్రెస్ పార్టీ నేతలు... కొన్ని రోజుల తరువాత యూపీ సైలెంట్ కావడంతో మరలా అక్కడ ఉద్రిక్త కరమైన పరిస్థితులు తీసుకురావాలని చెప్పి అనుకున్నారు.

 
అందుకే యూపీలో ప్రియాంక గాంధీ పర్యటించేందుకు సిద్ధం అయ్యింది.  దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.  అయితే, తనను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా మెడపట్టి తోశారని అన్నది.  కానీ, పోలీసులు మాత్రం తాము అలా చేయాలని అంటున్నారు.  ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్న యూపీలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లొల్లి చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం అని చెప్పాలి.  యూపీలో ఇప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: