దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడంలో మరు పేరుగా నిలిచినా సీనియర్ పార్లమెంటేరియన్ సుబ్రహ్మణ్య స్వామి కన్ను ఈ సారి తిరుమల తిరుపతి దేవస్థానంపై పడింది. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి   వత్తాసు పలికారు. అయితే ఆయన భక్తులు సమర్పించిన కానుకల లెక్కలు చెప్పమంటున్నారు. టీటీడీలో అస్తవ్యస్థంగా ఆడిటింగ్ వ్యవస్థ తయారైందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపోతున్నారు. ఈ విషయమై కొందరు కుహనా రాజకీయ నాయకులు అవకాశవాద రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలింతకీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నారో ఒకసారి పరిశీలిద్దాం. 

టీటీడీలో ఆడిటింగ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. ఆదివారం తిరుమల శ్రీవారిని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, కేంద్ర సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడారు.  శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలకు లెక్కలు లేవన్నారు.పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతీ కానుకకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత టీటీడీపైనే స్పష్టం చేశారు. కానుకల లెక్కలను నిగ్గు తెల్సాసి ఉందన్నారు.  

తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారంటూ జరుగుతున్నప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలలో నిజం లేదని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ సుబ్బారెడ్డి పై కూడా వస్తున్నా ఆరోపణలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నవేనని కొట్టిపారేశారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడంటూ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. రమణ దీక్షితులును తిరిగి ప్రధాన అర్చకుడిగా తీసుకోవడం శుభపరిణామని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా  టీటీడీ చైర్మన్ లేక క్రిస్టియన్ మత ప్రచారం పైన రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయని భావిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: