వైఎస్ జగన్ ఎలాంటి వ్యక్తి అనే విషయం అందరికి తెలుసు.  ఒక్కసారి ఒకటి అనుకున్నాడు అంటే దానిని సాధించే వరకు నిద్రపోడు.  అది ఏదైనా కావొచ్చు.  2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలోని 151 మంది ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతుగా నిలిచారు.  జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని సంతకాలు చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆనాటి కాంగ్రెస్ పెద్దలు కుట్రచేసి జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుపడ్డారు.  


ఒకవేళ జగన్ అప్పట్లో ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు వైకాపా పుట్టేది కాదేమో. ఇంకా చెప్పాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ సాహసించేది కూడా కాదు.  ఎందుకంటే జగన్ సత్తా గురించి ఆ పార్టీకి తెలుసు.  తండ్రి దగ్గరి నుంచి రాజకీయాలు, తన వంశం నుంచి ధైర్యసాహసాలు నేర్చుకున్నారు.  తెలంగాణను ఇస్తే తెలంగాణలో చక్రం తిప్పొచ్చని అక్కడి కాంగ్రెస్ నేతలు అనుకోవడం, బలహీనమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉంచితే...తెలంగాణ ఇవ్వడం ఈజీ అవుతుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు జగన్ ను పక్కన పెట్టారు.  


అప్పుడే జగన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు.  ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని.  2011లో వైకాపా పార్టీని స్థాపించారు.  ఒకవేళ ఇప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టయితే ఉమ్మడి రాష్ట్రానికి జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యేవారు.  అందులో సమస్య లేదు.  కెసిఆర్ ఇప్పటికి ప్రతిపక్షంలోనే ఉండేవారు.  అందులో సందేహం అవసరం లేదు.  ఇదంతా గతం.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ లో మొదట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది.  


అయితే, 2017 జనవరి 26 వ తేదీన గణతంత్ర వేడుకలు విశాఖలో నిర్వహించారు.  ఆ వేడుకలను అడ్డుకుంటానని జగన్ అప్పట్లో విశాఖ వెళ్లారు.  అయితే విశాఖలో జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో ఎయిర్ పోర్ట్ లోనే జగన్ రన్ వే పై కాసేపు నిరసనలు తెలిపారు.  అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.  కట్ చేస్తే 2019 లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.  151 స్థానాలు సాధించారు.  అలానే విశాఖ ఉత్సవ్ సమయంలో జగన్ కు ప్రజలు పూలు జల్లి స్వగతం పలికారు.  ఎక్కడైతే జగన్  ను పోలీసులు అడ్డుకున్నారో అక్కడే జగన్ కు సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు.  పట్టుదల అంటే అలా ఉండాలి.  దట్ ఈజ్ జగన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: