దేశంలో పౌరసత్వంపై అలజడులు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి.  సౌత్ లో కేరళ, కర్ణాటకలో, నార్త్ విషయానికి వస్తే ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో నిరసనలు జరుగుతున్నాయి.  ఈశాన్య రాష్ట్రాల్లో ఈ అలజడి సద్దుమణిగింది.  బిల్లును అర్ధం చేసుకున్న ప్రజలు అక్కడ సహకరిస్తున్నారు.  బిల్లు కేవలం ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు మాత్రమే ఉద్దేశించిన చట్టం అని ఇప్పటికే ప్రజలు అర్ధం చేసుకున్నారు.  


కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రగడలో అర్ధం లేదని అంటున్నారు. కానీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం ఇండియాను డివైడ్ చేయడానికి బీజేపీ కుట్రపన్నుతుంది అని అంటున్నారు.  సంపూర్ణ భారత దేశంకోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే విడదీయాలని ఎందుకు అనుకుంటుంది.  స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశం ఎలా ఉండేదో అలానే అఖండ భారతదేశం కోసం ఇండియా ప్రయత్నం చేస్తున్నది.  


ఇక ఇదిలా ఉంటె, పౌరసత్వ చట్టానికి సంబంధించి మిగతా ప్రాంతాల్లో కంటే ఎక్కువ అల్లర్లు యూపీలో జరిగాయి.  యూపీలో ముఖ్యంగా మీరట్ లో ఈ గొడవలు ఎక్కువగా జరిగాయి. కాల్పులు కూడా జరగడం విశేషం.  అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం మీరట్ సిటీ ఎస్పీ పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది.  నిరసనలు చేసే ముస్లింలను ఇండియా నుంచి వెళ్లిపోవాలని అన్నారని ఆరోపించింది.  


దీనిపై మీరట్ సిటీ ఎస్పీ స్పందించారు. తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.  మీరట్ లో నిరసనకారులు నిరసన తెలియజేస్తున్న వారిలో ఎక్కువ మంది యూత్ కూడా ఉన్నారని, వారంతా ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారని, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా చూస్తూ ఊరుకోవాలని అన్నారు.  అలానే ఇండియాకు శత్రుదేశమైన పాక్ కు అనుకూలంగా నినాదాలు చేస్తే కోపం రాదా అని ప్రశ్నించారు.  


అప్పటికి తాము శాంతించాలని కోరామని, కానీ కొందరు పాక్ కు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేస్తుండటంతో.. ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఇండియా వదిలి పాక్ కు వెళ్లిపోవాలని చెప్పినట్టు మీటర్ ఎస్పీ పేర్కొన్నారు.  మీరట్ ఎస్పీ చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్ ఏడీజీ సమర్ధించారు.  మీరట్ ఎస్పీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అన్నారు.  మీరట్ ఎస్పీకి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది.  దట్ ఈజ్ పోలీస్ అంటూ పొగుడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: