ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు అందరూ ఒక్కసారిగా భగ్గుమన్న  విషయం తెలిసిందే. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా  నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో అమరావతిలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతులే  కాకుండా రైతుల కుటుంబాలు సైతం రోడ్డెక్కి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అమరావతి విషయంలో హైపవర్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అయితే హైపవర్ కమిటీ లో సభ్యుడిగా ఉన్న కొడాలి నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అని కొడాలి నాని తెలిపారు. జిఎన్  రావు కమిటీ నివేదిక కూడా అదే సూచించిందని ఆయన తెలిపారు. రాజధాని తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని అమరావతి తో పాటు మరో రెండు ప్రాంతాల్లో రాజధాని ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధికి నోచుకుంటాయి  అని మంత్రి కొడాలి నాని తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల భూముల్లో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి చంద్రబాబు డబ్బులు దండుకున్నారని  ఆరోపించారు. ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధానిని కట్టాలంటే లక్ష 15 వేల కోట్లు అవసరం ఉంటుందని... ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రకారం అంత పెట్టుబడి పెట్టే వీలు లేదు అని కూడా కొడాలి నానీ  తెలిపారు. 

 

 

 

 ఈ విషయాన్ని రాజధాని రైతులందరికీ వివరిస్తామని అమరావతి తో పాటు ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి  అనే ఉద్దేశం తోనే  జగన్ సర్కార్ మూడు రాజధానిల నిర్ణయం తీసుకుందని.. ఈ నిర్ణయంపై రైతులందరూ సానుకూలంగా స్పందించి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటూ కొడాలి నాని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టాలని ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధులు సమకూర్చాలని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హైపవర్ కమిటీ నివేదిక ఉంటుంది అంటూ కొడాలి నాని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: