విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికేంద్రీకరణ జరిగితేనే అంతటా అభివృద్ధి జరిగితేనే సమన్యాయం జరుగుతుందని అభివృద్ధి అనేది ఒక చోట జరిగితే గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం అవుతుందని ఇటీవల ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూడు రాజధానుల విషయం తెరపైకి తీసుకువచ్చారు. దీంతో జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు తెరపైకి తీసుకు రావడం జరిగిందో ఆ సమయం నుండి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు మరియు అమరావతి ప్రాంతంలో రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఆ ప్రాంత ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు ఆందోళనలు తెలుపుతూ ప్రస్తుత అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేస్తూ వస్తున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు హరీష్ రావు ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల వివాదం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుతుందన్న ఉద్దేశంతో హరీష్ రావు కామెంట్ చేయటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల గొడవల వల్ల రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ రాష్ట్రంలో పురోగమిస్తుంది అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో మూడు రాజధానుల పై జరుగుతున్న గొడవ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక వరం లాంటిదని తాజాగా హైదరాబాద్ నగరంలో హరీష్ రావు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

 

దీంతో హరీష్ రావు వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. అంతే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణా లో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మెరుగ్గా ఉందని దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చెన్నైలో మంచినీటి సమస్య ఉంటే బెంగుళూరులో ట్రాఫిక్ సమస్య ఉండగా ఉత్తరాదిలో ఢిల్లీ కాలుష్యంతో ముంబై లో అధిక ధరలు తెలంగాణ హైదరాబాదులో ఎలాంటి సమస్యలు లేవని రియల్ ఎస్టేట్ రంగం మంచి జోరుమీద ఉందని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: