గత కొన్ని రోజులుగా పుదుచ్చేరిలో గవర్నర్ ముఖ్యమంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పుదుచ్చేరిలో కొన్ని కంపెనీలు స్థాపించాలని ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు పట్టుబడుతున్నప్పటికీ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ మాత్రం అందుకు అభ్యంతరం చెబుతోంది.  ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. వీరిద్దరి మాటల యుద్ధంతో పుదుచ్చేరి రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి సీఎం నారాయణస్వామి ల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు కాసినో మద్యం తయారీ సంస్థలు లాటరీ  కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తున్నారు. 

 

 

 

 కానీ గవర్నర్ కిరణ్ బేడీ మాత్రం అందుకు అభ్యంతరం చెబుతోంది. దీంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి గవర్నర్ కిరణ్ బేడీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా  వైరం నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే గవర్నర్ కిరణ్ భేడి ని  ముఖ్య మంత్రి నారాయణస్వామి దయ్యమని మనస్సాక్షి లేని వ్యక్తి అని, జర్మనీ నియంత హిట్లర్ కు  చెల్లెలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి గవర్నర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇకపోతే తాజాగా దీనిపై గవర్నర్ కిరణ్ భేడి  స్పందిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్య మంత్రి నారాయణస్వామి  హుందాగా  నడుచుకుంటే మంచిది అంటూ హితవు పలికారు గవర్నర్ కిరణ్ బేడీ. 

 

 

 

 గత కొన్ని రోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూశిస్తున్న విధానం గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరి ఉంది. ఒక రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న నేను ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటాను అంటూ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. అంతే కాకుండా ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తి ని  కూడా గవర్నర్ కిరణ్ బేడీ ప్రస్తావించడం గమనార్హం. ఎవరినైనా ఒకరిని దూషించినప్పుడు ఆ రెండో వ్యక్తి ఆ తిట్లను  స్వీకరించకపోతే ఆ తిట్లు మొదటి వ్యక్తుల వద్ద ఉంటాయి అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: