ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని అభివృద్ధి ఒకేచోట ఆగిపోకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పడే అవకాశం ఉంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారమే రేపింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయంపై గగ్గోలు పెడుతున్నాయి. అమరావతి అభివృద్ధి చేయడం చేతకాకె  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రెండు రాజధానిల నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇకపోతే రాజధాని రైతుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి ఒక్కసారిగా భగ్గుమన్నారు రాజధాని రైతులు. భవిష్యత్తు తరాలు బాగుండాలనే ఉద్దేశంతో మూడు పంటలు పండించుకునే అమ్మలాంటి భూమిని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మారుస్తామని  అంటున్నారని దీంతో తమకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ధర్నాలు ఆందోళనలు తెలుపుతున్నారు అమరావతి రైతులు. 

 

 

 

 అమరావతి రైతులే కాదు రైతు కుటుంబీకులు అంతా రోడ్లపైకి చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు  రాజధానిల  నిర్ణయం ప్రకటించిన తర్వాత ఇప్పుడు వరకు మీడియా ముందుకు రాని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కృష్ణా జిల్లా టిడిపి కార్యకర్తలు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లు మాత్రమే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు అని... జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే నిరసనలు తెలుపుతున్నారు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని గ్రాఫిక్స్ చూపించి నాశనం చేశారని ఆయన ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి త్వరలోనే ప్లాట్లు ఇస్తారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: