అసోంను చడ్డీవాలాలు పాలించలేరు. అసోంను నాగపూర్‌ చేతిలో కీలు బొమ్మగా మారనివ్వం... బీజేజీ, ఆర్ఎస్‌ఎస్‌ను టార్గెట్  చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇవి. సేవ్ కానిస్టిట్యూషన్...సేవ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ... కేంద్రంపై విరుచుకుపడింది. హింసను ప్రేరేపించే వాళ్లు నేతలు కారంటూ ఆర్మీ చీఫ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఫైర్ అయ్యారు. మైండ్ యువర్ బిజినెస్ అంటూ ఘాటుగా చురకలు అంటించారు. 

 

ఓ వైపు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే... ఈ చట్టాన్ని సమర్థించే వ్యతిరేకించే నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. సీఏఏకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సేవ్ కానిస్టిట్యూషన్... సేవ్ ఇండియా పేరుతో ఆందోళనలు ఉధృతం చేసింది. అసోంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... బీజేపీ , ఆర్ఎస్‌ఎస్‌ను టార్గెట్ చేశారు. అసోంను చడ్డీవాలాలు, నాగపూర్‌ వ్యక్తులు పాలించలేరని... ఇక్కడి ప్రజలే అసోం బాగోగులు చూసుకుంటారంటూ ధ్వజమెత్తారు.

 

తిరువనంతపురంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం...ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. మీ పని మీరు చూసుకోండి....ఇలాంటి సమస్యలపై స్పందించడం మీ పని కాదు అంటూ విమర్శించారు.  ఆర్మీ చీఫ్‌గా మీరు చేయాల్సిన పని చేస్తే సరిపోతుందని.. సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. 

 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక తుకుడే తుకుడే గ్యాంగ్ ఉందంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా  ఘాటుగా రియాక్టర్ అయ్యారు. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన తుకుడే తుకుడే గ్యాంగ్‌లు దుర్యోధన, దుశ్శాసన మాత్రమేననని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ బీజీపీలోనే ఉన్నారంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: