జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై ఓ సామాజికవర్గంలోని ప్రముఖులు ఎంతలా యాగీ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. ముందుగా చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత ఎల్లోమీడియా కూడా రంగంలోకి దూకింది. చంద్రబాబు అండ్ కో వ్యతిరేకతకు బాగా ప్రచారం చేస్తునే తనంతట తాను కూడా సొంతంగా జనాలను రెచ్చగొడుతోంది. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉరుములేని పిడుగు లాగ జగన్ ను వ్యతిరేకించారు.

 

అసలు ఇంత హఠాత్తుగా మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిన అవసరం వెంకయ్యకు ఏమొచ్చింది ? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే వెంకయ్య ఇపుడు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఏదో సామాజికవర్గంలోని కీలక నేతలకు మద్దతుగా వెంకయ్య మాట్లాడారని సరిపెట్టుకునేందుకు కూడా లేదు. ఎందుకంటే తన వ్యతిరేకతను వెంకయ్య పదే పదే వ్యక్తం చేస్తున్నారు. పైగా జగన్ సర్కాను బెదిరిస్తున్నట్లే మాట్లాడుతున్నారు.

 

వెంకయ్య ఇదంతా ఎందుకు చేస్తున్నారయ్యా అని ఆరా తీస్తే ఓ విషయం బయటపడింది. అదేమిటంటే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో వెంకయ్య కుటుంబం కూడా లబ్దిదారే అనే ప్రచారం రాజకీయవర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. వెంకయ్య కొడుకు, అల్లుడు కలిసి సుమారు 475 ఎకరాలు సిఆర్డీఏ పరిధిలోని కీలక ప్రాంతంలో కొన్నారట.  ఇన్ సైడర్ ట్రేడింగ్ కానీ లేదా బినామీ చట్టం ప్రకారం కానీ విచారణ చేయిస్తే వీళ్ళ గుట్టు కూడా బయటపడుతుందనే ప్రచారం ఊపందుకుంది.

 

ప్రభుత్వం ప్రకటించిన 4075 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ లో వెంకయ్య కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములు కూడా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రభుత్వం చదవి వినిపించిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లబ్దిదారుల్లో వెంకయ్య కుటుంబం వివరాలను ఉద్దేశ్యపూర్వకంగానే చదవలేని సమాచారం.  ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్యను గబ్బు పట్టించటం ఇష్టం లేకే లబ్దిదారుల జాబితాలో పేర్లను ప్రభుత్వం చదవలేదట.

 

అంటే వెంకయ్య కుటుంబం కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో తగులుకుందని అంటున్నారు. దీనిపై విచారణ జరిగితే తమ జాతకాలు ఎక్కడ బయటపడతామో అన్న టెన్షన్ మిగిలిన  పెద్దమనుషులతో పాటు వెంకయ్యను కూడా పట్టుకుందట. అందుకనే జగన్ ప్రతిపాదనను వెంకయ్య అంతగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటన్నారు. చూద్దాం ఇంకా ఎవరెరవరి పేర్లు బయటకు వస్తాయో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: