ఇప్పటికే మన దేశంలో చికెన్, మటన్ ల ధరలకు భారీగా రెక్కలొచ్చాయి. ఒకరకంగా మాంసం కంటే కూడా కూరగాయలు బెటర్ అని భావించి మాంసం బదులు వాటినే తింటున్న వారు కూడా అక్కడక్కడా ఉన్నారు. ఇక చికెన్, మటన్ కి పోటీగా ప్రస్తుతం మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కుక్క మాంసానికి భారీగా డిమాండ్ పెరిగిందట. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మటన్ కి బదులు గా కుక్క మాంసాన్ని కూడా వండి విరుస్తున్నారు అనే వార్తలు కూడా హల చల్ చేస్తున్నాయి. ఈ విషయం అటుంచితే, ప్రస్తుతం మన దేశంలోని మిజోరాం, 

 

త్రిపుర ప్రాంతాల్లో ప్రస్తుతం కుక్క మాంసానికి విపరీతంగా డిమాండ్ ఉందని, అక్కడ ప్రజలు కొందరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని కుక్క మాంసాన్ని తినడానికి మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఇకపోతే నేడు త్రిపుర సరిహద్దుల్లో ఒక భారీ వ్యాన్ లో తరలిస్తున్న కొన్ని కుక్కలను పట్టుకున్నారు అక్కడి పోలీసులు. వ్యానులో ఏమున్నాయని తాము తనిఖీలు చేస్తున్న సమయంలో వ్యాన్ నిండా కుక్కలు నిండి ఉండడం తమకు ఆశ్చర్యం కలిగించిందని, 

 

ఇప్పటికే మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో కుక్క మాంసానికి భారీగా డిమాండ్ ఉండడంతో, వ్యానులో వాటిని తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానించి డ్రైవర్ ని ప్రశ్నించగా, వ్యాన్ డ్రైవర్ కూడా అది నిజమేనని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అక్కడి మార్కెట్ లో కిలో కుక్క మాంసం రూ.2000 నుండి రూ.2500 వరకు పలుకుతున్నట్లు సమాచారం. కాగా డ్రైవర్ ని పూర్తిగా విచారించిన అనంతరం ఈ కుక్కలను ఎక్కడి నుండి  తీసుకువస్తున్నాడు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి విషయాలు విచారణలో బయటకు లాగుతాం అని అంటున్నారు పోలీసులు. కాగా ఈ ఘటన ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో విపరీతంగా వైరల్ అవుతుండగా, ప్రజలు దీని పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: