చంద్రబాబు తరచూ చెప్పే పదం సంపద సృష్టి.. దార్శనికత.. ఆర్థిక నైపుణ్యం.. ఇలాంటివి.. అందుకే ఆయన ఆర్థిక సదస్సులు నిర్వహిస్తారు.. ప్రపంచ ఆర్థిక సదస్సులకూ వెళ్తారు. తానో ఆర్థిక నిపుణుడిని అని చెప్పుకుంటుంటారు. తన వల్లే హైదరాబాద్ డెవలప్ అయ్యిందని ఆయన ఇప్పటికీ కనీసం వారానికి ఓసారైనా ప్రెస్ మీట్లో చెప్పుకొస్తుంటారు.

 

అయితే చంద్రబాబు మనీ సీక్రెట్ ఇదీ అంటున్నారో వైసీపీ మంత్రి.. తాను సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు నాయుడు మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారని ప్రశ్నించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమా అని ఆయన అన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎపికి 90 వేల కోట్ల అప్పు ఉంటే, చంద్రబాబు ఐదేళ్ల హయాంలో మరో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు.

 

అంతేకాక, మరో నలభై వేల కోట్ల బకాయిలుపెట్టి వెళ్లాడని గుర్తు చేశారు కొడాలి నాని. మరి ఇదేనా సంపద సృష్టించడం అంటే అని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిత్యం అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కొడాలి నాని అన్నారు. అంటే ఫైనల్ గా కొడాలి నాని తేల్చిందేంటంటే.. చంద్రబాబు మనీ సీక్రెట్ అంతా అప్పులు చేయడమే అని.

 

అయితే చంద్రబాబుపై కొడాలి నాని ఇలాంటి విమర్శలు చేయడం కొత్తేమీ కాదు.. మొదట్లో తెలుగు దేశం పార్టీలోనే ఉన్న కొడాలి నాని ఆ తర్వాత చంద్రబాబుతో విబేధించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చంద్రబాబు అంటే చాలు.. ఒంటికాలిపై లేస్తుంటారు కొడాలి నాని. అలవోకగా బూతులు తిట్టేస్తారు కూడా. అయితే చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన నాని.. ఇలా చంద్రబాబుపై రోజూ విమర్శలు చేయడం ఆ పార్టీ నేతలు తట్టుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: