ఉత్తర ప్రదేశ్ లో పౌరసత్వ చట్టంపై వెల్లువెత్తిన నిరసనలు, అలజడులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం యూపీలో 144 సెక్షన్ అమలులో ఉన్నది.  యూపీ అల్లర్లలో మరణించిన కుటుంబాలను కలుసుకోవాలని ఇటీవలే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యూపీ వచ్చేందుకు ప్రయత్నం చేశారు.  అయితే, వారిని ఉత్తర ప్రదేశ్ లోకి అడుగుపెట్టనివ్వలేదు.  

 


ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ఈ సమయంలో వెళ్లేందుకు అనుమతి లేదని, అక్కడికి వెళ్తే మరలా గొడవలు జరుగుతాయని చెప్పడంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.  అలా వెనక్కి వెళ్లిన ప్రియాంక గాంధీ, కొన్ని రోజుల తరువాత స్కూటర్ పై లక్నో వచ్చింది. పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసిన మాజీ ఐఏఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

 


ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక గాంధీ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ కార్యకర్త బైక్ మీద లక్నో వచ్చింది.  స్కూటీపై హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన ఆమెకు లక్నో పోలీసులు రూ. 6100 ఫైన్ వేశారు.  స్కూటీ ఫైన్ ను కాంగ్రెస్ కార్యకర్త కట్టడం విశేషం.  దారాపురి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు.  దారపురి ఇంట్లో పోలీసులు ఆమెను అడ్డుకొని మెడను పట్టుకొని తోశారట. 

 


దీంతో ప్రియాంక గాంధీ పోలీసులపై ఫైర్ అయ్యింది.  పోలీసులు తన మెడ పట్టుకున్నారని వాపోయింది.  గొడవలు జరుగాయి రావొద్దు అని చెప్పినా ప్రియాంక వెళ్ళింది. యూపీలో శాంతియుత వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం నిప్పు రాజేసేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.  పౌరసత్వం చట్టంలో ఎలాంటి తప్పులు లేవని ప్రజలు తెలుసుకున్నారు.  అందుకే నిరసనలను ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు.  ఇది కాంగ్రెస్ పార్టీకి రుచించడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: