వివాహం అనేది రెండు శరీరాల కలయిక కోసం చేసుకునే తంతు కాదు. ఇద్దరి జీవితాలకు మార్గం. రెండుకుటుంబాలకు ఆపాదించే బంధం. నాలుగు పాదాల ప్రయాణం. చక్కని జీవితానికి సమాజం ఏర్పరచిన కట్టుబాటు. పెళ్లి చేసుకోగానే సంబరం కాదు. ఒకరి మనసును ఒకరు అర్ధం చేసుకుని కలకాలం కాపురం చేస్తూ కన్నవారి పరువును కాపాడుతూ తాము కన్నవారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే ఆ వివాహ బంధానికి అర్దం.

 

 

కాని నేటికాలంలో పెళ్లంటే అమ్మాయి అందంగా ఉందా. కట్నకానుకలు ఎంతిస్తున్నారు. అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు ఎంత సంపాదిస్తున్నాడు. ఇవే చూస్తున్నారు గాని వీరిద్దరికి పెళ్లి చేస్తే ఎంతకాలం అన్యోన్యతగా ఉంటారు అన్నది ఏ తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ఇక భర్త పై భార్యకు. భార్య పై భర్తకు ఉండవలసింది నమ్మకం ప్రేమ. కాని నేటి కాలంలో పిల్లలకు పెళ్లి చేసిన కొత్తలో అన్ని ఉన్నట్లుగా అనిపిస్తాయి. కాని ఇవేవి తమ మధ్య లేవని తెలుసుకునే సరికి అంతా జరిగిపోతాయి.

 

 

ఇప్పుడున్న దంపతుల్లో ఎక్కువగా అనుమానాలు. ఒకరిపై ఒకరికి అపనమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలా జరిగిన ఓ జంట విషయంలో చోటు చేసుకున్న వింతైన విషయాలు ఓ సారి చూస్తే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ వ్యక్తి మంచి ఉద్యోగంతో పాటుగా పెద్ద మొత్తంలో వచ్చే జీతం ఉంది. అతనిది విలాసవంతమైన జీవితం. కాని అతనికి ఉన్న రోగం అనుమానం. అది చివరికి కట్టుకున్న భార్యను పదేపదే అనుమానించే స్దాయికి అతన్ని దిగజార్చింది..  

 

 

ఆ అనుమానంతో తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందేమో అని ఎన్నో రోజుల నుండి మనసులో పెట్టుకుని దాన్ని పెద్ద రోగంగా మార్చుకుని, చివరికి అతని భార్యకు ఎవరూ ఊహించని విధంగా భార్యకు శిక్ష విధించాడు.  అదేమంటే ఈ వెధవ ఉద్యోగానికి వెళ్లే ముందు ఆమె మర్మాంగాలకు తాళం వేసి వెళ్ళేవాడట. అతని భార్య ఎంత చెప్పిన ఆ మూర్ఖుడు వినకపోగా మరింతగా అనుమానించే వాడట.

 

 

దీంతో విసిగిపోయిన ఆ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేయగా తనకు తెలిసిన చుట్తుప్రక్కలివారు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె కోలుకున్న తర్వాత ప్రశ్నిస్తే జరిగిన విషయం మొత్తం చెప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు అనుమానపు భర్తను అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్తిస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: