తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అవగాహన సదస్సు ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు ఎంపీలు బండ ప్రకాష్ పసునూరి దయాకర్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా జడ్పీ చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ గ్రామాల రూపురేఖలు సీఎం కేసీఆర్ మార్చేశారని గ్రామ స్వరాజ్యమే అన్న దిశగా కేసీఆర్ తెలంగాణలో ఉన్న గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇంత అభివృద్ధి జరుగుతుంటే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

 

ఆ తర్వాత అనంతరం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... పల్లె ప్రగతి లో వరంగల్ అర్బన్ మరియు వరంగల్ రూరల్ ఉన్న గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..పల్లెలు అభివృద్ధి చెందటం అంటే భవనాలు కట్టడం రోడ్డు వేయడమే కాదు పల్లెలు పచ్చగా ఉండటం మరియు అదే విధంగా అందంగా ఉండటం అని గుర్తించిన సీఎం కేసీఆర్ పల్లెలకు అన్ని వసతులు ఉండేలా..339 కోట్ల రూపాయలనిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

 

బడ్జెట్లో  అనేక కార్యక్రమాలకు నిధుల కోత విధించినా పల్లె ప్రగతికి మాత్రం నెల నెల 339 కోట్ల రూపాయలు విడుదల చేయడం ఈ కార్యక్రమానికి సిఎం కేసిఆర్ ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల గ్రామంలో నీటి సమస్య తీరిపోయింది అని పేర్కొన్నారు. మరియు అదే విధంగా అంగన్వాడీలను స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలుగా తీర్చి దిద్దుతున్నారు..ఇందుకోసం కేంద్రం 20 శాతం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం నిధులు ఇచ్చి వీటినే నిర్వహిస్తోందన్నారు. అన్ని రకాలుగా దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల చూసుకుంటే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: