ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం మూడు రాజధానుల చుట్టూ తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో చివరి రోజు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేమిటని ప్రపంచం మారుతున్న తరుణంలో మన ఆలోచనలు కూడా మారాలని వికేంద్రీకరణ జరగాలని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జుడిషియల్ క్యాపిటల్, అదేవిధంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటే తప్పేమిటని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు ప్రజలు జగన్ తీసుకున్న నిర్ణయంపై అప్పటినుండి ఇప్పటివరకు తెగ ఆందోళనలు నిరసనలు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు.

 

ఇటువంటి తరుణంలో రాజధాని ప్రాంతానికి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా అమరావతి రాజధాని మార్చవద్దు అని ధర్నా చేస్తున్న రైతులపై దారుణమైన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే రాజధాని అమరావతి కోసం  రైతులు ధర్నా చేయడం లేదని, కృష్ణా జిలా టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రమే ధర్నాలు చేస్తున్నారని అన్నారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 10 శాతం మంది రైతులు మాత్రమే తమను ఆదుకోవాలని ఆందోళన చేస్తున్నారే తప్పా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని అన్నారు.

 

అంతేకాకుండా చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని నాశనం చేశారని కానీ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం జగన్ త్వరలోనే న్యాయం చేస్తారని పేర్కొన్నారు. దీంతో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులపై ఎమ్మెల్యే ఆర్కే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో...ఇప్పటికే విపక్ష పార్టీలు వాళ్ల ఆందోళనలో అడ్డంపెట్టుకుని జగన్ పై సీరియస్ అవుతున్న తరుణంలో..ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి రైతుల పై చేసిన వ్యాఖ్యలకు జగన్ కి ఒళ్ళు మండి సీరియస్ అయినట్లు వార్నింగ్ ఇచ్చినట్లు ఇటువంటి వాతావరణంలో అటువంటి కామెంట్లు అవసరమా..? అని ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: