లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ విద్యార్థుల కొరకు స్కాలర్ షిప్ అందిస్తోంది. 8వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఎల్ఐసీకి అనుబంధ సంస్థ. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఎల్ఐసీ 30 వేల రూపాయల వరకు పేద విద్యార్థులకు విద్యాధాన్ స్కాలర్ షిప్ పేరుతో స్కాలర్ షిప్ అందిస్తోంది. 
 
గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ను పొందటానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 31 2019 ధరఖాస్తు చేయడానికి చివరి తేదీ. విద్యార్థుల కుటుంబ సంవత్సర ఆదాయం 3 లక్షల రూపాయల లోపు ఉంటే ఈ స్కాలర్ షిప్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని అర్హతలు ఉంటే మాత్రమే ఈ స్కాలర్ షిప్ పొందటానికి విద్యార్థులు అర్హులు అవుతారు. 
 
స్కాలర్ షిప్ పొందటానికి 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అంతకుముందు తరగతిలో కనీసం 65 శాతం మార్కులతో పాసై ఉండాలి. 65 శాతం కంటే ఎక్కువ మార్కులొచ్చిన 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా 10వేల రూపాయల స్కాలర్ షిప్ ను పొందవచ్చు. పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పదవ తరగతిలో కనీసం 65 శాతం మార్కులతో పాసై ఉండాలి. 
 
ఎల్ఐసీ అనుబంధ సంస్థ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు 15వేల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తుంది. డిగ్రీ, గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందాలంటే ఇంటర్ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 20వేల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు స్కాలర్ షిప్ కు అర్హత పొందాలంటే డిగ్రీలో 65 శాతం మార్కులతో పాసై ఉండాలి. హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వీరికి సంవత్సరానికి 30,000 రూపాయల స్కాలర్ షిప్ ఇస్తుంది. www.lichousing.com వెబ్ సైట్ లో స్కాలర్ షిప్ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: