తెలుగు రాష్ట్రాల్లో  పాత్రికేయ ప్రమాణాలను మీడియా యాజమాన్యాలు వదిలేసి చాలా కాలమే అయ్యింది. ఇక్కడ మీడియా స్వేచ్చంటే యాజమాన్యాల స్వేచ్చే కానీ విలేకరుల స్వేచ్చ కాదు.  సొంతబుద్ధితో మీడియా యాజమాన్యాలు పనిచేయటం మానేసి చాలా కాలమే అయ్యింది. అందుకనే ఇపుడు చంద్రబాబునాయుడు, ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణలకు జాయింటుగా టెన్షన్ పెరిగిపోతోంది. విశాఖపట్నంకు రాజధాని తరలిపోకుండా ఎలా ఆపాలన్న విషయంలో  వీళ్ళకు దిక్కు తోచటం లేదు.

 

క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులు చూస్తుంటే అమరావతి నుండి జగన్ విశాఖకు రాజధానిని తరలించటం ఖాయమైపోయింది. ఇందుకు ఉగాధి పండుగను డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఒకవైపు అమరావతి కేంద్రంగా జరుగుతున్న ఆందోళనలను జగన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అందుకనే ఏం చేయాలో అర్ధంకాక  వీళ్ళిద్దరిలో టెన్షన్ పెరిగిపోతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ పాలనపై చిమ్మిన విషం ఒకెత్తయితే రాజధాని తరలింపులో చిమ్ముతున్న విషం మరోఎత్తు.

 

గడచిన ఏడు మాసాలుగా జగన్ పై ఎల్లోమీడియా ఎంతగా విషం చిమ్ముతోందో అందరూ చూసిందే.  చంద్రబాబే మరో 15, 20 ఏళ్ళు అధికారంలో ఉంటారన్న పిచ్చి నమ్మకంతో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా యాజమాన్యాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయి.  

 

అయితే వాళ్ళు ఊహించని విధంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో తెలుగుదేశంపార్టీ గూబ పగిలిపోయింది.  దాంతో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు కూడా కళ్ళు బైర్లు కమ్మాయి. కొద్ది రోజులు మైండ్ బ్లాంక్ అయినా తర్వాత కోలుకుని జగన్ పై విషం చిమ్మటం మొదలుపెట్టారు. జగన్ తీసుకునే ప్రతి విషయంపైనా వ్యతిరేక ప్రచారం చేస్తు  జనాలను రెచ్చ గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

జగన్ అమల్లోకి తెచ్చిన, తెస్తున్న నవరత్నాల పథకాలపైన కూడా వ్యతిరేక ప్రచారం చేశారు. ఇసుకకొరత పేరుతో నానా యాగీ చేశారు. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా జనాలను రెచ్చ గొడుతునే ఉన్నారు. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎంత విషం చిమ్మాలో అంతా చిమ్ముతున్నారు. సరే ఎవరెంతగా వ్యతిరేకం చేస్తున్న తాను అనుకున్నది అనుకున్నట్లే జగన్ చేసుకుపోతున్నారు. ఇక్కడే జగన్ అంటే వీళ్ళకు మంటగా తయారైంది. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాలకే వీళ్ళు ఇంత టెన్షన్ పడుతుంటే మిగిలిన నాలుగున్నరేళ్ళు జగన్ ను ఎలా తట్టుకుంటారో ఏమో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: