ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంతో క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మరెన్నో కోర్సులు  నేర్చుకుని ఇంకెన్నో ట్రిక్స్ నేర్చుకుని ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించడానికి నానా తంటాలు పడుతుంటారు. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక్కొక్కసారి లక్కు  కలిసిరాక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వరు . ఒకవేళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు అంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే నేటి తరం జనాలు  మంచి ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో ఎలాంటి కాంపిటీషన్ లేదు కానీ ఇప్పుడు మాత్రం కాంపిటేషన్ చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక జాబ్ కి 100 మందికి పైగానే వేచి చూస్తూ ఉండటం లాంటివి జరుగుతున్నాయి. దీంతో చిన్న జాబ్స్  దగ్గర నుంచి పెద్దల జాబ్స్ వరకు ఏ జాబ్  అయినా సంపాదించడానికి చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. 

 

 

 

 ఇక జాబ్ వచ్చింది అంటే ఆ తర్వాత మన టాలెంట్ ఎంటో  ప్రూవ్ చేసుకుని ఇంక్రిమెంట్లు మీద ఇంక్రిమెంట్లు కొట్టేయొచ్చు. ఆ తర్వాత శాలరీ అంతకంతకూ పెరుగుతూ వస్తుంటుంది.అందుకే మంచి కంపెనీలో మంచి జాబ్ లు  చూసుకోవడానికి చాలామంది కష్టపడుతుంటారు. ఇప్పటివరకూ ఉద్యోగాలకు సంపాదించడానికి కష్టపడిన వాళ్లను చూసి ఉంటారు,.. కానీ ఉద్యోగాల నుంచి మమ్మల్ని  తొలగించండి అంటూ కష్టపడిన వాళ్ళ ని ఎవరైనా చూశారా. హా  ఏముంది సరిగ్గా వర్క్ చేయకపోతే వారే  ఉద్యోగం నుంచి తీసేస్తారు అంటారా.. అలాంటిది ఇక్కడ కుదరవండోయ్ ... అందుకే ఇక్కడ ఏకంగా డబ్బులు ఇచ్చి మరి ఉద్యోగాల మానేస్తున్నారు . 

 

 

 ఇంతకీ ఎందుకు డబ్బులు ఇచ్చి మరి ఉద్యోగాలు మానేస్తున్నారు అంటారా..  అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ఈరోజుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం చాలా కష్టం కానీ జపాన్లో ఉద్యోగాలు వదులుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. జపాన్ లో  సాంప్రదాయం ప్రకారం ఒక ఉద్యోగి తన జీవితకాలం మొత్తం ఒకే యజమాని దగ్గర పని చేయాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగాలు చేసే వారి కష్టాలను తీర్చేందుకు ఉద్యోగాన్ని మానేసేలా  చేసేందుకు ఎగ్జిట్ అనే కంపెనీ పని చేస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి 50 వేల యెన్  అంటే మన కరెన్సీలో 30 వేలు చెల్లిస్తే మిగతా అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి బాస్ కు ఫోన్ చేసి రాజీనామా పత్రాన్ని వారే అందజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: