కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల పైకి చేరింది భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలందరి నిరసనలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. అంతే కాకుండా ఈ నిరసనలు పలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇకపోతే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారపురి  అరెస్టయ్యారు. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. అయితే ప్రియాంక గాంధీ బైక్ పై  వెళ్తున్న సమయంలో హెల్మెట్ ధరించకపోవడం తో... ప్రియాంక గాంధీకి,  ఆ పార్టీ నేత ధీరజ్ గుజ్జర్ కు  యూపీ పోలీసులు 6100 రూపాయల జరిమానా విధించారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారపురి అరెస్ట్  కావడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి పోలీసులు అనుమతించకుండా ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీలుల  కళ్ళుగప్పి తప్పించుకున్న ప్రియాంక గాంధీ, పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ తో  కలిసి బైక్ పై  బయలుదేరారు. అయితే వీరిద్దరూ బైక్ పై  వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఇకపోతే బైక్ పై  వెళ్తున్న సమయంలో బైక్ నడుపుతున్న ధీరజ్  కాని వెనుక కూర్చున్న ప్రియాంక గాంధీ కానీ హెల్మెట్ ధరించకపోవడం తో ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. 

 

 

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను యూపీ పోలీసులు 6100 రూపాయల జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపే అందుకుగాను ₹2500... హెల్మెట్ ధరించినందుకుగాను 500,  నిబంధనలు పాటించనందుకు  300 రూపాయలు, తప్పుడు నెంబర్ ప్లేట్ కలిగి ఉన్నందుకు 300,  నిర్లక్ష్యంగా నడిపినందుకు 2500 చొప్పున మొత్తం 6100 జరిమానా  విధించారు యూపీ పోలీసులు. ఇందుకు సంబంధించిన చలాన్ ను బైక్ యజమాని రాజ్ దీప్ సింగ్ కు పంపారు యూపీ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: