సంక్రాంతి పండగ వస్తుంది. పిల్లల బడులకు సెలవులు వస్తాయి. వారి అల్లర్లకు హద్దే ఉండదు. అలా అని వారిని పట్టించుకోకుండా వదిలేస్తే ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెడతారో అందరికి తెలుసు. ఇకపోతే పిల్లలు చేసే అల్లర్లు ముద్దుగా అనిపిస్తాయి. వారికి ఏదైనా జరిగితే పెద్దవారి ప్రాణాలు గిలగిలలాడుతాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ సెలవు దినాల్లో పెద్ద వారి నుండి పిల్లల వరకు అందరు గాలిపటాలు ఎగరేస్తుంటారు.

 

 

డాబాల పైనా, ఇంటి సందుల్లో, లేదా ఎక్కడైనా చేతిలో దారాలు గాలిపటం పట్టుకుని ఆనందంగా జారుతున్న చెడ్డి పైకి అనుకుంటు పిల్లలు గాలిపటం ఎగిరేస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఈ పతంగిల వల్ల ఒక్కోసారి ప్రాణాలకు అపాయం కలుగవచ్చూ. లేదా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఈ గాలిపటం ఓ బాలుడిని వికలాంగుడిని చేసింది. ఆ అవివరాలు తెలుసుకుంటే. వికారాబాద్‌ జిల్లా పరిగికి చెందిన పండ్ల వ్యాపారి రఫీ కుమారుడు మహ్మద్‌ షమీ(10) ఈ నెల 8న గాలిపటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు.

 

 

తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని కుటుంబీకులు నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ బాలున్ని పరీక్షించిన వైద్యులు ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అతని రెండు చేతులతో పాటు ఎడమకాలి రెండు వేళ్లను కూడా తొలగించారు. ఇకపోతే నిన్న మొన్నటిదాకా కళ్లముందే ఆడుతూపాడుతూ గెంతులేసిన కుమారుడు రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడిగా మారడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా రెండు కృత్రిమ చేతులను అమర్చి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు..

 

 

చూసారా ఒక్క రోజు ఆనందం కోసం బాలున్ని ఆడుకోనిస్తే శాశ్వతంగా వికలాంగుడిగా మారాడు. నిజంగా తల్లిదండ్రులు బ్రతికినంత కాలం వారికి తీరని మానసిక క్షోభ మిగులుతుంది. ఆ బాలుడి భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందుకే అందరు తమ పిల్లలపట్ల కాస్త శ్రద్ద వహించి ఈ పండగ సెలవుల్లో దగ్గర ఉండి మీ పిల్లలకు ఆనందాన్ని పంచగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: