సమాజంలో రోజురోజుకూ హత్యలు పెరిగిపోతున్నాయి అయితే ఈ హత్యల్లో  అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని  సొంత వాళ్ళని  హత్య చేసే ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన కన్న కొడుకునే చంపాలని ప్లాన్ వేసింది కసాయి తల్లి. కన్న కొడుకు కంటే అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడే ఎక్కువ అని భావించిన కసాయి తల్లి ప్రియుడితో కలిసి కొడుకుని హతమార్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో చోటు చేసుకుంది. 40 రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. చివరికి ఈ హత్య కేసులో తల్లే అసలు సూత్రధారి అని తేలింది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... గత కొంతకాలంగా రాణి అనే మహిళ కు  బాలస్వామి కి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే దీన్ని గమనించిన కొడుకు హార్థిక్ ఇదేం పని అంటూ తల్లిని  నిలదీసాడు. ఇలా చేయడం సరికాదంటూ హెచ్చరించాడు. అయితే తన ఆనందానికి తన కొడుకు హార్థిక్ అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయినది . దీంతో కొడుకును చంపాలని ఏ తల్లి చేయని ఆలోచన చేసింది ఈ కసాయి తల్లి. ప్రియుడు  బాలస్వామి తో కలిసి ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే పథకం ప్రకారం కొత్త దుస్తులు కొనిస్తాం అంటూ హార్థిక్ ను, రాణిని  బాలస్వామి   తీసుకొని నందివెలుగు వద్దకు వెళ్లారు. అక్కడ టిఫిన్ చేసిన అనంతరం రాణిని  పక్కకు తీసుకెళ్లి హార్దిక్ ను  చంపేస్తానని చెప్పి రాణి ని ఆటోలో ఇంటికి పంపించాడు బాలస్వామి. ఇక రాత్రి ఏడు గంటల సమయంలో హార్థిక్  మెడకు తాడు బిగించి హత్య చేశాడు. 

 

 

 

ఆ తర్వాత సెకండ్ షో సినిమా చూసి హత్యచేసిన ప్రాంతానికి వచ్చే హార్థిక్ మృతదేహానికి బండరాయి కట్టి ఓ తూములో  పడేసాడు బాలస్వామి. నవంబర్ మూడో వారంలో తూము నుంచి దుర్వాసన వస్తుండడంతో మంగళగిరి పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా  మృతదేహానికి నడుము కి బండ  రాయి కట్టి ఉంది. అమృత దేహం నీటిలోనే కుళ్ళిపోయింది. మృతదేహం హార్థిక్ అనే డిగ్రీ విద్యార్థి అని గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి ఆ పై విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణలో సీసీటీవీ కెమెరాలు సెల్ ఫోన్ కాల్ డేటా  వంటివి కీలకంగా మారాయి . తమదైన శైలిలో విచారించిన పోలీసులు అసలు విషయాన్ని బయటకు తెచ్చారు. తల్లి రాణి ప్రియుడు బాలస్వామి  తో ప్లాన్ వేసి కొడుకును హత్య చేసినట్లుగా  నిర్ధారించారు. ఇద్దరినీ  అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: