కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు  వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో ఈ నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజలందరూ రోడ్ల పైకి చేరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశం మొత్తం హాట్ హాట్ గా ఉంది. విపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సైతం పౌరసత్వ సవరణ చట్టం పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 

 

 

 

 పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  రాష్ట్ర పరిధిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెబుతున్నారు. తాము  పౌరసత్వ సవరణ చట్టానికి ఎన్ఆర్సి కి వ్యతిరేకం అంటూ  చేస్తున్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం పై నిరసనలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. అంతేకాకుండా ఈ నిరసనలు పలు ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ మొత్తం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులతో  అట్టుడికిపోతోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. 

 

 

 

 వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తీవ్రస్థాయిలో పౌరసత్వ సవరణ చట్టం పై నిరసన వ్యక్తం చేస్తోంది.ఇకపోతే  కాంగ్రెస్ చేపడుతున్న నిరసనల పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కాంగ్రెస్ నేతలు పౌరసత్వ సవరణ చట్టం పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని.. దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటూ ఆయన విమర్శించారు . దేశం లోకి అక్రమంగా చొరబడిన  వారి పై రాహుల్ కు మరి అంత ప్రేమ ఉంటే వారిని ఇటలీకి తీసుకెళ్లాలి అంటూ గిరిరాజ్ సింగ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: