ప్రపంచంలోనే అత్యంత విలువైన పాముని ముగ్గురు వ్యక్తులు పట్టుకున్నారు. ఇంకేముంది ఈ పాముని అమ్మి  కోట్లల్లో డబ్బులు దండుకుందాం అనుకున్నారు. దీనికోసం పక్క ప్లాన్ వేశారు. అయితే ఈ పామును విక్రయించేందుకు ప్రయత్నించగా చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఈ పాము కు ఎందుకు అంత డిమాండ్  ఉంది... ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. అత్యంత విలువైన అరుదైన పాము మధ్యప్రదేశ్ పోలీసులు రక్షించారు. ఈ పాము పేరు రెడ్ శాండ్ బోవ   స్నేక్. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాముకు ఎంత డిమాండ్ వుందో తెలుసా.. ఏకంగా మార్కెట్లో ఈ పాము ధర 1.25 కోట్లు. అయితే ఈ అరుదైన పాము ను పట్టుకున్న ఐదుగురు వ్యక్తులు నర్సింఘర్  ప్రాంతంలో అరుదైన ప్రాణమును విక్రయించేందుకు ప్రయత్నించారు. 

 

 

 

 కానీ పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ అరుదైన పాము విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల వెనుకకు తోసారు. అయితే ఈ పామును  పట్టుకుని విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో  ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అత్యంత విలువైన అరుదైన జాతికి చెందిన రెడ్ సాండ్  బోవా స్నేక్ విషపూరితమైన పాము కాదని పోలీసులు వెల్లడించారు. ఈ పామును మందులు కాస్మెటిక్స్ తయారీలో వాడుతూ ఉంటారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చేతబడులు చేసేందుకు కూడా ఈ పామును ఉపయోగిస్తారని పోలీసులు వెల్లడించారు. 

 

 

 

 అందుకే ఈ పాముకు  మార్కెట్ లో అంత  డిమాండ్ ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఈ పాము దగ్గర ఉంటే మంచి జరుగుతుందని లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని చాలామంది నమ్ముతుంటారు అంటూ తెలిపారు పోలీసులు. అయితే స్థానిక బస్టాండ్ ప్రాంతంలో పాము విక్రయం పై ఫోన్ మాట్లాడుతుండగా.... అక్కడే ఉన్న పోలీస్ ఇన్ ఫార్మర్ విని సమాచారం ఇచ్చారని.. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి  దాడి జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపార., పాములు అమ్మేందుకు విక్రయించిన ఐదుగురిలో పవన్ నాగర్,  శ్యామ్ గుర్జార్ తో  పాటు ముగ్గురు మైనర్లు ఉన్నారని తెలిపారు . సెహోర్  జిల్లాలో ఈ అరుదైన పాము దొరికిందని నిందితులు తమ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.వన్య ప్రాణి  రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు  పేర్కొన్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: