రాజధాని అమరావతి అంశంపై చేపట్టిన తుళ్లూరు దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ మహిళ నాయకులు సుంకర పద్మ శ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సోమవారం తుళ్లూరు, వెలగపూడి , మందడం గ్రామాల్లో రైతుల నిరసన దీక్ష లకు మద్దతు తెలిపిన అమరావతి పరిరక్షణ సమితి సోషల్ కన్వీనర్ తుమ్మల కార్తీక్, కాంగ్రెస్ మహిళ నాయకులు సుంకర పద్మ శ్రీ, అజేయ్ కుమార్, డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మ శ్రీ సుంకర మాట్లాడుతూ.. చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ  చెప్పు చూపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించింది. 


ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే  అంబటి రాంబాబును పట్టుకుని ఆయనో పిచ్చికుకాక అని సంబోధించింది. మనమేమైనా జగన్మోహన్ రెడ్డిలాగా  జైలుకు వెళ్లామా అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి అంటూ రుసరుసలాడింది. డిజిపి ఎక్కడినుండి వచ్చాడు.. జగన్మొహన్ రెడ్డికి డిజిపి చంచాగిరి చేస్తున్నాడు. జగన్ నువ్వు ఒక తల్లికి కొడుకువు అయితే , ఒక చెల్లికి అన్నవు అయితే, ఒక భార్యకు భర్తవు అయితే ఇందరు మహిళల కన్నీళ్లు పెట్టించవు అని నిలదీశారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మహిళలతొ పెట్టుకొవద్దని హెచ్చరించారు. ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏమైంది. .. బ్యూటీ పార్లర్ లో వుందని ఇక్కడి మహిళలు కేసులు పెట్టారు. కేసులు పెట్టుకుంటారా..? ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకొండి మేం భయపడమన్నారు. 


రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అమరావతి పరిరక్షణ సమితి సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ తుమ్మల కార్తీక్ అన్నారు. రైతుల కన్నీరు రాష్టానికే కాదు దేశానికి మంచిది కాదన్నారు. మీకు  ఫొన్ నెంబర్ ఇస్తాం ఏ అవసరమైనా ఫొన్ చేస్తే వెంటనే అమరావతి పరిరక్షణ సమితి సభ్యులుగా వస్తామని భరోసా కల్పించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని పులివెందుల ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.

అమరావతే ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి ఐదు కోట్ల ప్రజలు మద్దతు పలుకుతున్నారు. రేపు రైతుల మద్దగా విజయవాడ సివిల్ కోర్టు నుండి హైకోర్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం.రైతుల మనోధైర్యం కోసేమే మేము మీ వెంటనే ఉంటామన్నారు. త్వరలోనే శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్ర చేపడతామని చెప్పారు. ఈ పోరాటం 29 గ్రామాల రైతులది కాదు రాష్ట్ర సమస్య అని అన్నారు.  29 గ్రామ రైతుల వెంట రాష్ట్రం ఉందన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: