ఇండియా చుట్టూ ఎన్నో దేశాలు ఉన్నాయి.  అందులో కొన్ని మిత్రదేశాలు ఉంటె, చైనా, పాక్ వంటి శత్రుదేశాల కూడా ఉన్నాయి.  1947 నుంచి ఇండియా పాక్ మధ్య గొడవ జరుగుతూనే ఉన్నది.  దీనికి ప్రధాన కారణం చైనా.  ఇండియాను ఆసియాలో బలమైన శక్తిగా ఎదగకుండా చేయాలి అన్నది చైనా ప్లాన్.  అందుకే ఇండియా నుంచి పాక్ విడిపోగానే స్నేహహస్తం ఇచ్చింది.  చైనా డబ్బును అసకగా చూపించి పాక్ ను లొంగదీసుకుంది.  


అసలే డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న దేశం.  డబ్బు వస్తుంది అంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  డబ్బుకు పాక్ అమ్ముడుపోయింది.  చైనా తానా అంటే పాక్ తందానా అంటోంది.  పాక్ ను అడ్డం పెట్టి చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.  ఇప్పుడు ఇండియాకు చెందిన రక్షణ రంగంపైనే దృష్టి పెట్టింది.  ఇండియన్ నేవి అధికారులు కొందరిని హానిట్రాప్ ఉచ్చులోకి దించింది.  అందమైన అమ్మాయిలను వారికి వలలా వేశారు.  


ఈ వలలో ఏడుగురు నేవి అధికారులు చిక్కుకున్నారు.  అమ్మాయిలు చెప్పినట్టు విన్నారు.  రహస్యాలను అందజేశారు.  విషయం నేవికి తెలిసింది.  వారిపై కఠిన చర్యలు తీసుకుంది.  మనదేశానికి చెందిన రక్షణ రహస్యాలు శత్రుదేశాల సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో షాక్ అయ్యింది.  వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.  దీనికోసం నేవీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 


ఇకపై నేవి అధికారులు ఎవరూకూడా సోషల్ మీడియా వాడకూడదు అని నిషేధం విధించింది.  ఒక్క సోషల్ మీడియానే కాదు... బ్రౌజింగ్, ఈ కామర్స్ వంటి వాటిపై కూడా నేవీ నిషేధం విధించింది.  ఇక డాక్ యార్డ్ వంటి వాటిల్లో స్మార్ట్ ఫోన్లపై కూడా నిషేధం విధించింది.  సింపుల్ గా చెప్పాలి అంటే, రక్షణ రంగంలో ఉండే వాళ్లకు ఇకపై స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులో ఉండదు.  దీనిద్వారా కొంతవరకు వీటిని అరికట్టవచ్చు అన్నది ఇండియన్ నేవీ ఉద్దేశ్యం.  

మరింత సమాచారం తెలుసుకోండి: