చిత్తూరు జిల్లాలో నాటు సారా తయారీ జోరుగా సాగుతోంది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాకు ఎక్సైజ్ పోలీసులు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. డ్రోన్‌లతో అడవిని జల్లెడ పట్టి సారా స్థావరాలపై దాడులకు ప్లాన్ చేస్తున్నారు. 

 

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సారా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కుప్పం సరిహద్దు ప్రాంతాలతో పాటు తంబల్లపల్లి నియోజకవర్గంలోని తండాలు, పుంగనూరు, పలమనేరు, పీలేరు, నగరి నియోజకవర్గాలలో ఎక్కువుగా నాటు సారా తయారీ చేస్తున్నారు. ప్రధానంగా రాసానపల్లెలో కొన్నేళ్ల నుంచి ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. సారా పూర్తిస్థాయి నిర్మూలనకు ఎక్సైజ్‌ అధికారులు నవోదయం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా రాసానపల్లెలో అరికట్టలేకపోయారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా గుడిపాల మండలంలో సారా రాజ్యం కొనసాగుతోంది. ఆర్థికంగా వెనకబడిన వారే గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నాటుసారా తయారీకి సాహసిస్తున్నారు. 


 
సారా తయారీ కేంద్రాలపై అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నా వ్యాపారులు వాటిని ఖాతరు చేయడం లేదు. మళ్లీ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. అధికారులు దాడులకు వస్తున్నారన్నా.. సమాచారాన్ని రాబట్టుకోవడమే కాకుండా, పట్టుబడితే విడిపించుకునేందుకు రాజకీయ బలాన్ని వినియోగిస్తున్నారు. మరోవైపున ఎక్సైజ్‌ అధికారులు దాడులకు నిరాయుధంగా వెళ్తుండటం వారి ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. 

 

ఇన్ని సమస్యల నడుమ నాటుసారా స్థావరాలను ధ్వంసం చేయడానికి జిల్లా ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. రాష్టంలో తోలిసారిగా టెక్నాలజీని వినియోగించి నాటుసారాకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. అందుకోసం సరిహద్దు గ్రామాలను జల్లెడ పట్టడానికి డ్రోన్ కెమెరాను వినియోగిస్తున్నారు. నాటుసారా స్ధావరాలను కెమెరా ద్వారా గుర్తించి నేరుగా బలగాలతో వెళ్ళి ధ్వంసం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల పక్కా సమాచారంతో సాటుసారాకు అడ్డుకట్టవేయచ్చని భావిస్తున్నారు. 

 

మొత్తానికి చిత్తూరు జిల్లా అడవుల్లో నాటు సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసులైతే వేట కొనసాగిస్తున్నారు. టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్నారు. డ్రోన్లను రంగంలోకి దించారంటే దాన్ని బ ట్టి అర్థం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: