రాజకీయాల్లో కేటీఆర్ కు ఏం ఇష్టం. మంత్రి పదవా... పార్టీ పోస్టా ?  కేటీఆర్ కు సినిమాల్లో యాక్ట్ చేయాలన్న కోరిక ఉందా?  పొరుగు రాష్ట్రంలో పరిణామాలపై కేటీఆర్ అబ్జర్వేషన్ ఏంటి ?  హైదరాబాద్ కి న్యూలుక్ ఇచ్చే ప్రణాళికలపై 
అప్‌ డేట్ ఏంటి  ?.... ఇలాంటి సందేహాలకు స్వయంగా కేటీఆరే...సమాధానమిచ్చారు. 

 

ట్విటర్  లైవ్ లో కేటీఆర్, నెటిజన్ల మధ్య ఆసక్తికర  ట్వీట్ నడిచాయి. రాజకీయాలు, పరిపాలన, అభివృద్ధి పనులపై  వచ్చిన ట్వీట్స్ కు కేటీఆర్ సమాధానాలిచ్చారు. మంత్రిగా బాగుందా లేక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాగుందా అనే ఓ నెటిజన్ ప్రశ్నకు.. తన ఓటు వర్కింగ్ ప్రెసిడెంట్ కే అని ట్వీటేశారు కేటీఆర్. ఇక ప్రతిపక్షాలపై అధికార పార్టీ విధానాలపై... ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.  ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వానికి ఏం తెలుస్తుందని ట్వీట్ లో ప్రశ్నించాడు. ఇక ఇంకో నెటిజన్.. ఏపీలోనూ పార్టీని విస్తరించాలని కోరాడు. మరో నెటిజన్ మీరు తెలంగాణ వారు అనే విషయం మర్చిపోయి.. ఏపీలో జగన్ పాలన ఎలా ఉందని ప్రశ్నించాడు. బాగా మొదలైందన్న కేటీఆర్.. మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీ ప్రజలే నిర్ణయించాలని తెలివిగా సమాధానమిచ్చారు.

 

జనవరి మొదటివారంలో కుడా మాస్టర్ ప్లాన్ మొదలవుతుందన్నారు కేటీఆర్. రైతుభీమా అందని రైతులకు త్వరలో ఆ  సొమ్ము  చెల్లిస్తామన్నారు. కొత్త మున్సిపాలిటీ చట్టంతో అవినీతికి చెక్ చెబుతామన్నారు. కొత్త ఏడాదిలో టి హబ్ రెండో ఫేజ్ ప్రారంభమవుతుందన్నారు. అదే విధంగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో సేవల పొడిగింపుపై కసరత్తు జరుగుతుందన్నారు కేటీఆర్. హైదరాబాద్ రోడ్లను త్వరలోనే మెరుగుపరుస్తామన్న కేటీఆర్.. సమగ్రరోడ్ల నిర్వహణ ప్రారంభించామన్నారు. సినిమాలో నటిస్తారా అన్న నెటిజన్ ప్రశ్నకు.. ఇప్పటికే ఫుల్ టైమ్ ఉద్యోగముందని కేటీఆర్ రిప్లై ఇచ్చారు.  అదే సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న... బిగ్ బికి శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: