జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటన ముందుకు వెళ్ళకుండా ప్రతిపక్షాలన్నీ కలిసి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ముఖ్యంగా జగన్ చెప్పినట్లుగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేయటానికి వీల్లేదంటూ చంద్రబాబునాయుడుతో సహా ప్రతిపక్షాల నేతలంతా ఏకతాటిపై నిలిచారు.  సరే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను నిలపటం సాధ్యం కాదని అందరికీ బాగా తెలుసు. అందుకనే జగన్ ప్రయత్నాలకు బ్రేకులు వేసేందుకు న్యాయపరమైన విధానం ఒక్కటే మార్గమని అందరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 

ఏ విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా రాజధాని మార్పు విషయంలో మాత్రం ప్రతిపక్షాలన్నీ జగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్నట్లే అనిపిస్తోంది. చంద్రబాబు, బిజెపి ఎంపి సుజనా చౌదరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వాళ్ళంతా కలిసి అమరావతి రైతులతో లోలోపల మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.   జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా  రైతులు కోర్టుల్లో కేసులు వేసేట్లుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు.

 

తాజాగా అమరావతి గ్రామాల్లో తిరిగిన సుజనా మాట్లాడుతూ జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు కోర్టుల్లో కేసులు వేయాలని సూచన చేయటం గమనార్హం. ఇదే విధమైన సూచనలను ఓ నాలుగు రోజుల క్రితం టిడిపి కూడా రైతులకు చేసింది. ఇక పవన్ కల్యాణ్ కు ఏ విషయంలో కూడా సొంత అభిప్రాయాలంటు ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏమి చెబితే ఓ రెండు రోజుల తర్వాత అదే విషయాన్ని పవన్ రిపీట్ చేస్తుంటారు.

 

రాజధాని ఏర్పాటన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంగానీ లేకపోతే కోర్టులు కానీ జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువే. కానీ ఏదో విధంగా జగన్ ను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో  కాంట్రాక్టర్ల ద్వారా కానీ లేకపోతే ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకున్న వారితో కానీ కేసులు వేయిస్తే ఏదో ఓ వంకన జగన్ ప్రయత్నాలను ఆపుచేయచ్చు అనే ఆలోచన కనబడుతోంది. కాబట్టి ఈ ప్రయత్నాలకు జగన్ ఎలాంటి విరుగుడు ఆలోచిస్తారో చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: