చెడ్డి గ్యాంగ్... ఈ పేరు చెబితేనే హడలిపోతారు జనాలు. ఎందుకంటే ఈ చెడ్డి గ్యాంగ్  దొంగతనాలు అలా  ఉంటాయి మరి . నగర శివారులోనే  కాదు నగరాల్లో కూడా వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ చెడ్డి గ్యాంగ్  దొంగతనాలకు అయితే హద్దు అదుపు ఉండదు. అందినకాడికి దోచుకుని పోతూ ఉంటారు. రాష్ట్రంలోని ప్రతి చోట చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది.గత  కొంతకాలంగా హైదరాబాద్ నగర శివార్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ... హల్ చల్ చేసింది ఈ చెడ్డి గ్యాంగ్. దీంతో ఇది పోలీసులకు సవాలుగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎట్టకేలకు చెడ్డి గ్యాంగ్ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... గత కొంతకాలంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోనే టార్గెట్ చేసుకొని చెడ్డీగ్యాంగ్ వరుస దొంగతనాలకు పాల్పడుతుంది . 

 


 దీంతో పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీగ్యాంగ్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. చెడ్డి గ్యాంగ్ లోని ఏడుగురిని రాచకొండ ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. చెడ్డి గ్యాంగ్ లోని సభ్యులందరూ పగటిపూట బొమ్మలు అమ్ముకుంటూ తాము  దొంగతనం చేయాలనుకునే ప్రాంతంలో రెక్కీ నిర్వహించి... రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి అందినకాడికి దోచుకో పోతుంటారని పోలీసులు తెలిపారు . ఈ చెడ్డి గ్యాంగ్ ముఠా పై ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వీరు హల్చల్ సృష్టించారు.
 ఉత్తరప్రదేశ్ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మొత్తం ఈ చెడ్డి గ్యాంగ్ పై  పై 14 కేసులు నమోదయ్యాయి. 

 


 ఈ చెడ్డి  గ్యాంగ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యుల నుండి  150 గ్రాముల బంగారం మూడు వేల నగదు 400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ప్రస్తుతం మహారాష్ట్ర అకోలా లో నివాసముంటున్న వీరిని టెక్నికల్ ఆధారాలతో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తించిన ఈ చెడ్డి గ్యాంగ్ తో ప్రజల తో  పాటు పోలీసులకు కూడా నిద్రలేకుండా చేసిన చెడ్డి గ్యాంగ్ చివరికి పోలీసుల చేతికి చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు పోలీసులు. అయితే కొంతకాలం వరకు వరుస దొంగతనాలకు పాల్పడి ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజుల వరకు కామ్ గా ఉండిపోతుంది ఈ గ్యాంగ్. ఆ తర్వాత మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించి పకడ్బందీ ప్లాన్ తో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: