రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఎన్నో నో పెట్టు పల్లాలను చవిచూడాల్సి ఉంటుంది. రాజకీయంగా అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాలి. దానికి తగ్గ మనో ధైర్యం కావాలి. వీటన్నిటికీ చక్కని ఉదాహరణ చెప్పుకోవాలంటే వైసీపీ అధినేత జగన్ ముందుగా అందరికీ గుర్తుకు వస్తాడు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సొంతంగా పార్టీని స్థాపించి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూనే వచ్చారు. ఫలితంగా తిరుగులేని మెజారిటీతో ఏపీలో అధికారం దక్కించుకున్నాడు.  కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే రాజకీయంగా ఆయన మొదటినుంచి సరిదిద్దుకోలేని  తప్పులు చేస్తూనే వచ్చారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన మొదటి తప్పు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడమే. 


ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ పవన్ ప్రశ్నించే సాహసం చేయలేకపోగా బాబు చెప్తే సరే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ వస్తూ ఆయన్ను నమ్ముకున్న పార్టీ నాయకులను, అభిమానులను ఆయన దగా చేస్తూనే వస్తున్నాడు. దీని ఫలితంగానే 2019 ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ ఓడిపోగా ఒక్క సీటుకే పరిమితం అయిపోయాడు. పోనీ ఇప్పటికీ పవన్ రాజకీయంగా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అదీ లేదు. 


ఇప్పటికీ లోకేష్, చంద్రబాబు చూపించిన బాటలోనే నడుస్తూ మరింతగా దిగజారిపోతున్నట్టు కనిపిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని విమర్శించాడు పవన్. అలాగే వైసీపీ అధికారంలో ఉండగా మళ్లీ అదే పార్టీని విమర్శిస్తూ పవన్ తాను చంద్రబాబు మనిషిని అన్నట్టుగా చెప్పకనే చెబుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేను ఉన్నాను అన్నట్టుగా పవన్ ప్రత్యక్షం అవుతుంటారు. టీడీపీకి మద్దతుగా వైసీపీకి వ్యతిరేకంగా ట్విట్లు పెడుతూ చంద్రబాబు విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే అమరావతి విషయంలో చంద్రబాబు,లోకేష్ పడుతున్న బాధను తాను కూడా పంచుకుంటూ ఏపీకి అన్యాయం జరిగిపోతున్నట్టుగా పవన్ గుండెలు బాదుకుంటుండడం విమర్శలపాలవుతోంది.


 పవన్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోకుండా బాబు బాట బంగారు బాట అని అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తే రాజకీయంగా మరింత దిగజారిపోయి పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. పవన్ వ్యవహారశైలి, టీడీపీతో అంటకాగుతున్న విషయంపైనా ఆ పార్టీలో కొంతమంది నాయకులకు రుచించకే పార్టీకి రాజీనామా చేసి పవన్ కు దూరంగా ఉంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: