రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది స్మార్ట్ ఫోన్ వాడకం కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేని మనిషి లేడు అనడంలో అతిశయోక్తి లేదు . ఎక్కడో కోటికో నోటికో ఒక్కరు ఉంటారు తప్ప మిగతా వారందరి దగ్గర అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు  కనిపిస్తూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ ధర పెట్టి మంచి ఫీచర్ లు  ఉన్న మొబైల్  కొనుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు నేటితరం జనాలు. ఇంకేముంది మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో ఫోన్లు వస్తూనే ఉన్నాయి . మార్కెట్లోకి ఎన్ని ఫోన్ లు  వచ్చిన వాటిని కొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటున్నారు నేటితరం జనాలు. ఇక తాము వాడే స్మార్ట్ ఫోన్లో  ఎంత మంచి ఫీచర్స్ ఉంటే తాము అంత గొప్ప వాళ్ళం అని ఫీల్ అవుతున్న వాళ్లు కూడా చాలామంది ఉంటారు. 

 


 ఇప్పటికే మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఎన్నో రకాల సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వచ్చాయి. పోటాపోటీగా అతి తక్కువ ధరలకే నెటిజన్లకు ఫీచర్లు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే మార్కెట్లో చాలా మొబైల్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నాయి. ఇలా కొత్త అప్డేట్ లు వరుసగా వస్తూనే ఉంటాయి. అటు నెటిజన్లు కూడా సరి కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్ ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఫోన్ ధర ఎంత అయినా అందులో ఫీచర్స్ మాత్రం ఏ ఫోన్ లో లేనట్టుగా ఉంటే నెటిజన్లు బాగా అట్రాక్ట్  అయి పోతూ ఉంటారు. అటు మొబైల్ కంపెనీలు కూడా ఎక్కువ ఫీచర్లు అందించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు  మార్కెట్లో లభిస్తున్నాయి. 

 


 అయితే ఇప్పటివరకు ఎన్నో  ఫీచర్లతో ఫోన్ వచ్చినప్పటికీ సరికొత్తగా మరో సరికొత్త ఫీచర్లతో ఇంకో ఫోన్ రాబోతుంది. ఈ స్మార్ట్  ఫోన్ స్పెషాలిటీ ఏమిటి అంటారా... భూకంపం వస్తుంది అంటే ఈ ఫోన్ ముందే మనకు సమాచారం అందిస్తుంది. ఫన్ టచ్ ఓఎస్ 10 లో అత్యాధునిక ఫీచర్ ను  వివో మొబైల్ కంపెనీ డెవలప్ చేస్తుంది. భూమిపై రాబోతున్న భూకంపానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలిపే.. టెక్నాలజీ ప్రస్తుతం ఇంటర్నల్ టెస్టింగ్ లో ఉందని వివో తెలిపింది. దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఫన్  టచ్  ఓఎస్ 10 ప్రాజెక్టు మేనేజర్ జియా జాంగ్  తెలిపారు. భూకంపాన్ని 10 సెకన్ల ముందుగానే కనిపెట్టేలా ఈ కొత్త టెక్నాలజీ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎంఐయుఐ టీచర్ ను లాంచ్ చేయగా.. దానిలాగే ఫన్  టచ్ ఫీచర్ కూడా ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: